Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BJP: తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ అడుగులు.. జాతీయ నాయకుల కీలక నిర్ణయం..

తెలంగాణలో మెజార్టీ ఎంపీ సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా బీజేపీ ప్లాన్ చేస్తుంది. ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లేందుకు కసరత్తు ప్రారంభించింది. అందుకు వివిధ కమిటీలను వేసిన పార్టీ వారికి మార్గ నిర్దేశం చేసింది. మార్చి ఒకటి తర్వాతనే పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వస్తుందని అభిప్రాయంతో బీజేపీ నేతలు ఉన్నారు. బీజేపీ శాసనసభ పక్ష నేత ఎంపికపై కూడా ఆ పార్టీ దృష్టి పెట్టింది.

BJP: తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ అడుగులు.. జాతీయ నాయకుల కీలక నిర్ణయం..
Bjp Telangana
Follow us
Sridhar Prasad

| Edited By: Srikar T

Updated on: Jan 29, 2024 | 2:45 PM

తెలంగాణలో మెజార్టీ ఎంపీ సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా బీజేపీ ప్లాన్ చేస్తుంది. ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లేందుకు కసరత్తు ప్రారంభించింది. అందుకు వివిధ కమిటీలను వేసిన పార్టీ వారికి మార్గ నిర్దేశం చేసింది. మార్చి ఒకటి తర్వాతనే పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వస్తుందని అభిప్రాయంతో బీజేపీ నేతలు ఉన్నారు. బీజేపీ శాసనసభ పక్ష నేత ఎంపికపై కూడా ఆ పార్టీ దృష్టి పెట్టింది. ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకుంది. త్వరలోనే ప్రధాని సభతో ఎన్నికల శంఖారావం మోగించనుంది కమలం పార్టీ. పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెంచింది. పార్లమెంటు ఎన్నికల్లో చేయాల్సిన కార్యక్రమాలపై వివిధ కమిటీలను వేసింది. ఆయా కమిటీలతో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు సునీల్ బన్సల్, తరుణ్ చ్చుగ్‎లు భేటీ అయ్యారు. ఆయా కంపెనీ చేయాల్సిన పనులపై మార్గ నిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం చేయాలని వాల్ రైటింగ్స్, ఫ్లెక్సీలు, హోర్దింగ్స్‎లతో పాటు మరిన్ని మార్గల్లో ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ డిసైడ్ అయింది. పార్టీలో చేరికలు పై దృష్టి పెట్టనుంది.

పార్లమెంట్ ఎన్నికల్లో తమకు కాంగ్రెస్‎కు మధ్యనే పోటీ ఉంటుందని భావిస్తోంది. కేసీఆర్ కుటుంబం అవసరం తెలంగాణ ప్రజలకి లేదని బీజేపీ నేతలు అంటున్నారు. మెజారిటీ సీట్లను గెల్చుకుంటామని చెబుతున్నారు. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో కోసం ప్రజల అభిప్రాయం తీసుకుంటామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పారు. నవ యువ ఓటర్ల కోసం సమ్మేళనాలు పెడతామన్నారు. పార్టీలో చిన్న చిన్న సమస్యలు ఉన్నా సర్దుకుంటాయంటున్నారు. మోడీని మూడో సారి అత్యధిక మెజారిటీతో అధికారంలోకి తీసుకురావడం కోసం అందరం కలిసి ముందుకు పోతామన్నారు. ఈ నెలలోనే మోడీకి సంబంధించి రెండు కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ఇక పార్లమెంట్ ఎన్నికల కోసం పార్లమెంట్ పొలిటికల్ ఇంఛార్జులు, కన్వీనర్‎లతో సమావేశం అయిన బన్సల్, తరుణ్ చుగ్.. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ సమావేశంలో నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఉత్తరాదిలో అనుసరించినట్లు దక్షిణాదిలో కుదరదని చెప్పినట్టు సమాచారం. బీజేపీ కార్యక్రమాలు , నేతల మాటలు బట్టి చూస్తే మార్చి మొదటి వారం తరువాతే పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..