Hyderabad: దారుణం.. కత్తులతో పొడిచి యాచకుడి హత్య.. బెగ్గింగ్ మాఫియా పనేనా..?

హైదరాబాద్‌లో బెగ్గింగ్ మాఫియాకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. గతంలో వృద్ధులు, చిన్న పిల్లలతో భిక్షాటన చేయిస్తూ.. రోజుకు వేల నుంచి లక్షలు సంపాదిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతితెలిసిందే.. తాజాగా.. బెగ్గింగ్ మాఫియా రెచ్చిపోయి మరో దారుణానికి పాల్పడింది.

Hyderabad: దారుణం.. కత్తులతో పొడిచి యాచకుడి హత్య.. బెగ్గింగ్ మాఫియా పనేనా..?
Begging
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 29, 2024 | 12:34 PM

హైదరాబాద్‌లో బెగ్గింగ్ మాఫియాకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. గతంలో వృద్ధులు, చిన్న పిల్లలతో భిక్షాటన చేయిస్తూ.. రోజుకు వేల నుంచి లక్షలు సంపాదిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతితెలిసిందే.. తాజాగా.. బెగ్గింగ్ మాఫియా రెచ్చిపోయి మరో దారుణానికి పాల్పడింది. సికింద్రాబాద్‌లో యాచకుల మధ్య జరిగిన గొడవ కాస్త.. ఉద్రిక్తతలకు దారి తీసి, ఏకంగా చంపుకోవడం వరకు వెళ్లింది. సికింద్రాబాద్‌లో ఆదివారం రాత్రి యాచకుల మధ్య గొడవ జరిగింది.. అయితే అప్పటికే మద్యం మత్తులో ఉన్నారు వాళ్లు.. ఆ మత్తులో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న యాచకుడిని కత్తితో పొడిచి చంపారు తోటి యాచకులు.. ఒకరిని నరికి చంపారు. ఇంకొకరిపై హత్యాయత్నం జరిగింది.

వివరాల్లోకెళ్తే..

మొదటి ఘటనలో మోండా మార్కెట్‌ సమీపంలోని ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న యాచకుడిపై ముగ్గురు వ్యక్తులు దాడి చేశారు. ముగ్గురూ కలిసి కత్తితో పొడిచి చంపారు. మారేడ్‌పల్లిలో రెండో ఘటన జరిగింది. ఈ ఘటనలో యాచకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. స్థానికులు గమనించడంతో అక్కడి నుంచి పారిపోయారు యాచకులు.. సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనలపై మోండా మార్కెట్‌, మారేడ్‌పల్లి పోలీస్‌స్టేషన్లలో పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ రెండు ఘటనల్లోనూ బెగ్గింగ్ మాఫియా హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, గత కొంతకాలం నుంచి జరుగుతున్న గొడవ.. చంపుకునే వరకు వెళ్లిందని.. ఇదంతా బెగ్గింగ్ మాఫీయా కనుసన్నల్లోనే జరిగినట్లు తెలుస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!
పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!