Hyderabad: హైదరాబాద్‌లో కెమెరాకు చిక్కిన ఘోర రోడ్డు ప్రమాదం.. వీడియో చూడండి
హైదరాబాద్‌లో ఓ వ్యాన్ బీభత్సం సృష్టించింది.. KPHB కూకట్‌పల్లి వసంతనగర్‌లో వేగంగా వ్యాన్ దూసుకుపోయి, మహిళను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి CC ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..
హైదరాబాద్, జనవరి 29: వాహనం నడిపేటప్పుడు ఫోకస్ చాలా అవసరం. ఏదో పరధ్యానంలో ఉండి డ్రైవ్ చేస్తే ప్రమాదాలు జరుగుతాయి. అంతేకాదు వాహనదారులకు భయం, బాధ్యత ఉండాలి. హెవీ వెహికల్స్ అయితే ఇంకాస్త జాగ్రత్త ఉండాలి. ఏదైనా జరిగాక అనుకుంటే రాదు. హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో, వేగంగా వస్తున్న గూడ్స్ వ్యాన్ ఢీకొని, ఓ మహిళకు గాయాలయ్యాయి. ఈ ఘటన హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి వసంతనగర్‌లో చోటుచేసుకుంది.
మహిళపై రోడ్డుకు ఓ పక్కన నడుచుకుంటూ వెళ్తుంది. ఇంతలో గూడ్స్ వ్యాన్ వేగంగా దూసుకువచ్చింది. టర్నింగ్ వద్ద స్లోగా వెళ్లాలన్న కామన్‌సెన్స్ కూడా లేదు ఆ డ్రైవర్‌కు. దీంతో వాహనం అదుపుతప్పి.. ఒక పక్కకు లేచి ముందుకు వెళ్లింది. ఆ సమయంలో అటుగా వెళ్తున్న మహిళకు తగలడంతో ఆమె తీవ్ర గాయాలతే కిందపడిపోయింది. వెంటనే స్థానికులు స్పందించి.. బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ వెంటనే అక్కడ్నుంచి పరారయినట్లు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
అతి వేగం ఎన్నో అనర్ధాలను తెస్తుంది. మీది మాత్రమే కాదు.. అవతలి వాళ్లది కూడా ప్రాణమే. అందుకే సిటీల్లోని రోడ్లపై వెళ్లేటప్పుడు కాస్త స్లోగా వెళ్లడం ఉత్తమం. ఆ మహిళ ఏం తప్పు చేసిందని.. ఇంతలా గాయపడాల్సి వచ్చింది. ఇది రేపు ఎవరి కుటుంబ సభ్యులకు అయినా జరిగొచ్చు. కాబట్టి వాహనాలను జాగ్రత్తగా నడపండి.
యాక్సిడెంట్ వీడియో
Walking on the road side in the streets is also not safe, due to #Speeding vehicles?
A #Speedy goods vehicle lost control at the turning point and hit a woman, walking on the road side. She is seriously injured.#RoadAccident #RoadSafety #Hyderabad pic.twitter.com/oypr9vR2Th
— Surya Reddy (@jsuryareddy) January 28, 2024
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.