AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: మంచి ఉద్యోగం.. 15 రోజుల్లో పెళ్లి.. ఇంతలోనే ప్రెగ్నెన్సీ కన్ఫామ్.. చివరకు..

మంచి ఉద్యోగం.. 15 రోజుల్లో పెళ్లి.. అంతా రెడీ చేసుకుంటోంది.. ఈ క్రమంలోనే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవ్వడంతో డిప్రెషన్‌లోకి వెళ్లింది. ప్రియుడికి ఫోన్ చేసి చెప్పింది.. ఆ తర్వాత క్షణికావేశంలో దారుణ నిర్ణయం తీసుకుంది.. ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది.

Hyderabad: మంచి ఉద్యోగం.. 15 రోజుల్లో పెళ్లి.. ఇంతలోనే ప్రెగ్నెన్సీ కన్ఫామ్.. చివరకు..
Crime News
Shaik Madar Saheb
|

Updated on: Jan 29, 2024 | 1:13 PM

Share

మంచి ఉద్యోగం.. 15 రోజుల్లో పెళ్లి.. అంతా రెడీ చేసుకుంటోంది.. ఈ క్రమంలోనే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవ్వడంతో డిప్రెషన్‌లోకి వెళ్లింది. ప్రియుడికి ఫోన్ చేసి చెప్పింది.. ఆ తర్వాత క్షణికావేశంలో దారుణ నిర్ణయం తీసుకుంది.. ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. సహజీవనం చేస్తున్న యువకుడితో వచ్చేనెల 12న పెళ్లి చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్న యువతి అనూహ్యంగా ఆదివారం తెల్లవారుజామున బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.. అత్తాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్‌ రాష్ట్రానికి చెందిన అదితి భరద్వాజ్‌(34) కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్ నగరానికి వచ్చి స్థిరపడింది. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న అదితి.. గతంలో ఓ వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆ తర్వాత విడాకులు తీసుకుంది. అనంతరం మణికొండలో నివాసం ఉంటోంది. ఈ సమయంలో కొంతకాలంగా తనతో కలిసి పనిచేసే చింతల్‌మెట్‌కు చెందిన మహ్మద్‌అలీతో అదితి సహజీవనం చేస్తోంది. దీంతో అలీ.. అత్తాపూర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలోని హ్యాపీహోమ్స్‌ కాలనీలో ఓ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ను అద్దెకు తీసుకుని.. అదితిని ఉంచాడు. వచ్చేనెల 12న ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఆరోగ్యం బాగా లేకపోవడంతో అదితి భరద్వాజ్‌ ఆసుపత్రికి వెళ్లింది. పరీక్షించిన వైద్యులు.. అదితి గర్భం దాల్చినట్లు తెలిపారు. అప్పటినుంచి మనస్తాపంతో ఉన్న అదితి.. డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. ఆదివారం తెల్లవారుజామున మహ్మద్‌ అలీకి ఫోన్‌చేసి తాను తీవ్ర ఒత్తిడిలో ఉన్నానంటూ చెప్పి ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఫోన్ తర్వాత వెంటనే అలీ.. ఫ్లాట్‌కు చేరుకుని చూడగా.. అదితి ఫ్యాన్‌కు ఉరేసుకొని కనిపించింది.

Crime News

దీంతో అలీ అత్తాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు .. పరిశీలించి వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అత్తాపూర్ ఇన్‌స్పెక్టర్‌ యాదగిరి తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్