BJP: మెజారిటీ ఎంపీ సీట్లే లక్ష్యంగా బీజేపీ భారీ స్కెచ్.. అంతుచిక్కని వ్యూహంతో..
బీజేపీ పార్లమెంట్ స్ట్రాటజీ ఏంటి.? ఇంచార్జీలే అభ్యర్థులా లేదా గెలుపు కోసమే తాజా, మాజీ ప్రజా ప్రతినిధులకు బాధ్యతలు ఇచ్చారా.? పదిహేడు స్థానాలకు ఇంచార్జిలను ప్రకటించి ఎన్నికల శంఖారావం మోగించిన కమల సేన వ్యూహం పై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది...

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ హైకండ్ ఏం ఆలోచిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. పార్లమెంట్ ఎన్నికలో బీజేపీ అంతుచిక్కని వ్యూహంతో ముందుకు వెళ్లనున్నట్లు స్పష్టమవుతోంది. ఇంతకీ తెలంగాణలో మెజారిటీ ఎంపీ సీట్లు గెలుచుకునే దిశగా బీజేపీ ఎలాంటి అడుగులు వేస్తోంది.? ఏ నిర్ణయాలు తీసుకోనుంది.? తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..
బీజేపీ పార్లమెంట్ స్ట్రాటజీ ఏంటి.? ఇంచార్జీలే అభ్యర్థులా లేదా గెలుపు కోసమే తాజా, మాజీ ప్రజా ప్రతినిధులకు బాధ్యతలు ఇచ్చారా.? పదిహేడు స్థానాలకు ఇంచార్జిలను ప్రకటించి ఎన్నికల శంఖారావం మోగించిన కమల సేన వ్యూహం పై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. పార్లమెంట్‌లో పది స్థానాలు పక్కాగా గెలవాలి అని టార్గెట్ పెట్టుకున్న బీజేపీ దానికి అనుగుణంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ఇంచార్జిల అంశాన్ని చాల కీలకంగా తీసుకున్నారు బీజేపీ పెద్దలు.
అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను దృష్టిలో పెట్టుకొని ముఖ్య నాయకులకు బాధ్యతలు అప్పగించింది బీజేపీ. అయితే 17 ఎంపీలకు ఇంచార్జిలను నియమించిన విధానం చూస్తే ఇంచార్జీలే అభ్యర్థులు అవ్వనున్నారా అనే డౌట్ వస్తోంది. అన్ని సీట్లలో కాకపోయినా కొన్ని స్థానాల్లోనైనా ఇంచార్జిలకు సీట్లు ఇస్తారా అనే చర్చ పార్టీలో జోరందుకుంది. ఇక ఎంపీ స్థానానికి కూడా పార్టీలో ఫుల్ డిమాండ్ నెలకొంది. ఒక్కో సీట్ కోసం ఏకంగా ముగ్గురు నుంచి నలుగురు ఆశావాహులు ఢిల్లీ స్థాయి నుంచి పైరవీలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
సిట్టింగ్ ఎంపీలతో పాటు సీనియర్ నాయకులు కూడా సీట్ల కోసం పోటీ పడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలతో పాటు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ఎంపీ లక్ష్మణ్ కూడా ఇంచార్జి బాధ్యతలు అప్పగించారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన వారికి బాధ్యతలు ఇవ్వడం వల్ల ఉపయోగం ఉంటుందని భావిస్తున్నారు. ఎమ్మెల్యేలుగా తాము అవలంభించిన గెలుపు వ్యూహాన్ని ఎంపీ ఎన్నికల్లో ఉపయోగిస్తారన్న ఆలోచలో అధిష్టానం ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా ఎక్కడ ఇబ్బందులు రాకుండా ప్రచారంతో పాటు పోల్ మేనేజ్ మెంట్ పక్కాగా ఉంటుందని బీజేపీ ముఖ్య నాయకులు భావిస్తున్నారు.
ఇందులో భాగంగానే వారికి ఇంచార్జి బాధ్యతతలు ఇచ్చినట్లు తెలుస్తోంది. గెలిచిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో పాటు మాజీలు అందరికీ తమ సొంత పార్లమెంట్ నియోజవర్గ బాధ్యతలు అప్పటించారు. దీనివల్ల అసెంబ్లీ నియోజవర్గాలను ప్రభావితం చెయ్యడంతో పాటు పక్క నియోజవర్గాలను కూడా కోఆర్డినేట్ చేసుకోవచ్చనేది పార్టీ అగ్ర నేతల వ్యూహంగా తెలుస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..