Telangana: బీజేపీ హైకమాండ్‌కు ఈటల, కోమటిరెడ్డి ఏం చెప్పారు? తెలంగాణ పొలిటికల్ సర్కిల్‌లో ఇంట్రస్టింగ్ టాక్..!

తెలంగాణ బీజేపీలో కుమ్ములాటలు హైకమాండ్‌కి తలనొప్పిగా మారాయి. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతోన్నవేళ నేతల మధ్య విభేదాలు ఢిల్లీ పెద్దల్ని కలవరపెడుతున్నాయి. ఎలాగైనా పార్టీని అధికారంలోకి తీసుకురావాలని తాము ప్రయత్నిస్తుంటే,

Telangana: బీజేపీ హైకమాండ్‌కు ఈటల, కోమటిరెడ్డి ఏం చెప్పారు? తెలంగాణ పొలిటికల్ సర్కిల్‌లో ఇంట్రస్టింగ్ టాక్..!
Telanagana Bjp
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 25, 2023 | 7:16 AM

తెలంగాణ బీజేపీలో కుమ్ములాటలు హైకమాండ్‌కి తలనొప్పిగా మారాయి. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతోన్నవేళ నేతల మధ్య విభేదాలు ఢిల్లీ పెద్దల్ని కలవరపెడుతున్నాయి. ఎలాగైనా పార్టీని అధికారంలోకి తీసుకురావాలని తాము ప్రయత్నిస్తుంటే, మీ గొడవలేంటని మండిపడుతోంది హైకమాండ్‌. పార్టీని సెట్‌రైట్‌ చేసేందుకు ఈటల రాజేందర్‌, కోమటిరెడ్డి రాజగోపాల్‌ను ఢిల్లీకి పిలిచి మాట్లాడింది. మరి, అమిత్‌షా, నడ్డాకి వారిద్దరూ ఏం చెప్పారు? ఎవరిపై కంప్లైంట్‌ చేశారు.. పొలిటికల్ సర్కిల్‌లో ఏం టాక్ వినిపిస్తోంది? వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

తెలంగాణలో ఈసారి అధికారం చేజిక్కించుకోవాలని గట్టి ప్రయత్నాలే చేస్తోంది బీజేపీ హైకమాండ్. ఈ క్రమంలోనే రాష్ట్రంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. అయితే, దానికంటే ముందుగా పార్టీని సెట్‌రైట్‌ చేసి, ఆ తర్వాత ఎన్నికలపై దృష్టిపెట్టాలని నిర్ణయించింది. అందులో భాగంగానే పార్టీ నేతలు ఈటల రాజేందర్‌, కోమటిరెడ్డి రాజగోపాల్‌ను ఢిల్లీకి పిలిచి మాట్లాడింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలు.. ఇద్దరితో చర్చలు జరిపారు. సుమారు మూడున్నర గంటలపాటు సుదీర్ఘంగా మాట్లాడింది బీజేపీ హైకమాండ్‌. తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై విస్తృతంగా చర్చించారు. అదే టైమ్‌లో నేతల మధ్య సమన్వయం కోసం ఏం చేయాలో చెప్పాలంటూ అభిప్రాయాలు తీసుకున్నారు అమిత్‌షా, నడ్డా. ఈటల రాజేందర్‌, కోమటిరెడ్డి రాజగోపాల్‌తోపాటు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కూడా ఈ మీటింగ్స్‌లో పాల్గొన్నారు.

ఢిల్లీ టూర్‌పై కీలక కామెంట్స్‌ చేశారు ఈటల రాజేందర్‌. తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి?, పార్టీ బలోపేతానికి ఏం చేయాలి? అంటూ అమిత్‌షా, నడ్డా అడిగారన్నారు. అయితే, పార్టీ పుంజుకోవాలంటే ఏం చేయాలో క్లియర్‌గా అధిష్టానానికి చెప్పామన్నారు ఈటల. ఇక, కోమటిరెడ్డి రాజగోపాల్‌ అయితే ఉన్నది ఉన్నట్టు చెప్పేశామన్నారు. నిర్మోహమాటంగా, ముక్కసూటిగా అన్నింటినీ హైకమాండ్‌ దృష్టికి తీసుకెళ్లామన్నారు. అయితే, ఎన్నికలవేళ ఆలస్యం లేకుండా నిర్ణయాలు తీసుకుంటేనే పార్టీకి మేలు జరుగుతుందని కుండబద్దలు కొట్టినట్టు చెప్పామన్నారు రాజగోపాల్‌.

ఇవి కూడా చదవండి

అయితే, ఈటల, రాజగోపాల్‌లు పైకి చెబుతున్న దానికీ.. జరుగుతోన్న ప్రచారానికీ తేడా కనిపిస్తోంది. అసంతృప్తితో అలకబూనిన ఈ ఇద్దరినీ బుజ్జగించడానికే ఢిల్లీకి పిలిచారనే టాక్‌ వినిపిస్తోంది.

మొత్తానికి క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే కాషాయదళంలో వర్గపోరు, అంతర్గత విబేధాలు తారాస్థాయికి చేరాయి. తెలంగాణ బీజేపీలో ఇంటిపోరు కొంపముంచేలా ఉందని గుర్తించిన అధిష్టానం ఏమాత్రం ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగింది. ఎన్నికలకు ఇంకా నాలుగైదు నెలలే ఉండటంతో ఆలోపు, టీబీజేపీని సెట్‌రైట్‌ చేయాలనుకుంటోంది హైకమాండ్‌. మరి, తెలంగాణ బీజేపీ నేతలు దారిలోకి వస్తారా? ఏకతాటిపైకొచ్చి కలిసి పనిచేస్తారా? లేదా? అనేది చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..