AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: మాజీమంత్రి మల్లా రెడ్డికి షాక్.. రెవెన్యూ సర్వేలో వెలుగులోకి కీలక విషయాలు..

మాజీ మంత్రి మల్లారెడ్డి ల్యాండ్ ఇష్యూ కొలిక్కి వచ్చింది. సుచిత్రలో వివాదాస్పదంగా మారిన ల్యాండ్‌ని సర్వేచేసిన అధికారులు మల్లారెడ్డిది కాదని తేల్చారు. బీఆర్ఎస్ మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి బిగ్ షాక్ తగిలింది. హైదరాబాద్ సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82లో ఉన్న 33 గుంటల స్థలం మల్లారెడ్డి కాదని రెవిన్యూ అధికారులు తేల్చారు. ఈ మేరుకు హైకోర్టుకు రెవెన్యూ అధికారులు నివేదిక అందజేశారు. సైబరాబాద్ పోలీసులకు సర్వే రిపోర్టును పంపించారు. దశాబ్ద కాలంగా అది తన భూమి అని చెప్పుకుంటున్నారు మల్లారెడ్డి.

Telangana: మాజీమంత్రి మల్లా రెడ్డికి షాక్.. రెవెన్యూ సర్వేలో వెలుగులోకి కీలక విషయాలు..
Malla Reddy
Srikar T
|

Updated on: Jun 13, 2024 | 8:55 AM

Share

మాజీ మంత్రి మల్లారెడ్డి ల్యాండ్ ఇష్యూ కొలిక్కి వచ్చింది. సుచిత్రలో వివాదాస్పదంగా మారిన ల్యాండ్‌ని సర్వేచేసిన అధికారులు మల్లారెడ్డిది కాదని తేల్చారు. బీఆర్ఎస్ మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి బిగ్ షాక్ తగిలింది. హైదరాబాద్ సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82లో ఉన్న 33 గుంటల స్థలం మల్లారెడ్డి కాదని రెవిన్యూ అధికారులు తేల్చారు. ఈ మేరుకు హైకోర్టుకు రెవెన్యూ అధికారులు నివేదిక అందజేశారు. సైబరాబాద్ పోలీసులకు సర్వే రిపోర్టును పంపించారు. దశాబ్ద కాలంగా అది తన భూమి అని చెప్పుకుంటున్నారు మల్లారెడ్డి. అయితే అందులో 1.11 ఎకరాలు తమదేనని, తలా 400 గజాలు కొన్నామని, కోర్టు తీర్పు తమకే అనుకూలంగా వచ్చిందని పదిహేను మంది వ్యక్తులు ఫెన్సింగ్ వేసుకున్నారు. సర్వే నెంబర్ 82లో ఉన్న ల్యాండ్ పై 15 మంది బాధితులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫెన్సింగ్‌ను మల్లారెడ్డి తన అల్లుడు మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డితో వచ్చి మే 19వ తేదీన తొలగించారు.

ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మల్లారెడ్డితోపాటు ఆయన అల్లుడిని పోలీస్‌ స్టేషన్‌కి తరలించారు పోలీసులు. ఈ భూ వివాదంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కూడా ఉన్నారు. భూమి తమదే అంటున్న పదిహేను మందిలో ఆయన కూడా ఒకరు. గతంలోనే సర్వే కోసం ఎన్నిసార్లు రమ్మని చెప్పినా మల్లారెడ్డి రాలేదని.. తనకు సర్వే అవసరంలేదని చెప్పారని ఆయన ఆరోపించారు. అప్పటి మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్ కూడా ల్యాండ్ వివాదం సెటిల్ చేసుకోమని చెప్పినా . కేటీఆర్ మాటలను కూడా మల్లారెడ్డి పెడచెవిన పెట్టారని ఆరోపించారు అడ్లూరి లక్ష్మణ్. వివాదం తర్వాత ప్రభుత్వం ఆ స్థలంలో సర్వేకు ఆదేశించింది. మల్లారెడ్డి, ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డిల సమక్షంలోనే సర్వే చేశారు. సర్వే చేపట్టిన రెవిన్యూ అధికారులు.. ఆ భూమిని మల్లారెడ్డి కబ్జా చేసినట్లు తేల్చారు. దీంతో ల్యాండ్ పై ఉన్న మరో వర్గం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మల్లారెడ్డిపై చర్య తీసుకోవాలని కోరుతున్నారు. అయితే భూమి తనది కాదని తేలడంతో ఇప్పుడు మల్లారెడ్డి స్టెప్‌ ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…  

జాగ్రత్త గురూ.. తక్కువ తాగినా ముప్పుతప్పదట.. తాజా అధ్యయనంలో సంచలన
జాగ్రత్త గురూ.. తక్కువ తాగినా ముప్పుతప్పదట.. తాజా అధ్యయనంలో సంచలన
ఏపీ స్కూల్స్‌కు సంక్రాంతి సెలవులు లిస్టు వచ్చేసిందోచ్..
ఏపీ స్కూల్స్‌కు సంక్రాంతి సెలవులు లిస్టు వచ్చేసిందోచ్..
ఒకే రోజు 29 మ్యాచ్‌లు..38కోట్ల ప్రైజ్ మనీ..అసలేంటి బాక్సింగ్ డే
ఒకే రోజు 29 మ్యాచ్‌లు..38కోట్ల ప్రైజ్ మనీ..అసలేంటి బాక్సింగ్ డే
MINIMOON: తక్కువ ఖర్చు, సమయం.. ఎక్కువ ఎంజాయ్‌మెంట్!
MINIMOON: తక్కువ ఖర్చు, సమయం.. ఎక్కువ ఎంజాయ్‌మెంట్!
వాహనదారులకు గుడ్‌న్యూస్‌..! పన్ను తగ్గింపు..
వాహనదారులకు గుడ్‌న్యూస్‌..! పన్ను తగ్గింపు..
కొత్త సంవత్సరం వేళ ఇంట్లోంచి సామాన్లు బయటపడేస్తారు! ఎక్కడో తెలుసా
కొత్త సంవత్సరం వేళ ఇంట్లోంచి సామాన్లు బయటపడేస్తారు! ఎక్కడో తెలుసా
పళ్లు తోమితే చాలు అనుకుంటున్నారా?అసలు ఎంత సేపు, ఎలా బ్రష్ చేయాలి
పళ్లు తోమితే చాలు అనుకుంటున్నారా?అసలు ఎంత సేపు, ఎలా బ్రష్ చేయాలి
హైదరాబాద్ వాసులకు రద్దీ లేని ప్రయాణం.. 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు
హైదరాబాద్ వాసులకు రద్దీ లేని ప్రయాణం.. 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు
గర్ల్ ఫ్రెండ్ ఉండగానే రచ్చ..హార్దిక్ రియాక్షన్ చూసి అంతా షాక్
గర్ల్ ఫ్రెండ్ ఉండగానే రచ్చ..హార్దిక్ రియాక్షన్ చూసి అంతా షాక్
రిస్క్‌ లేకుండా మీ డబ్బును భారీగా పెంచే స్కీమ్‌ ఇవే!
రిస్క్‌ లేకుండా మీ డబ్బును భారీగా పెంచే స్కీమ్‌ ఇవే!