TGPSC Group 1 Mains 2024 Schedule: టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌ షెడ్యూల్‌ విడుదల.. మొత్తం 6 పేపర్లకు పరీక్ష

తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ ప‌రీక్షల‌కు సంబంధించిన షెడ్యూల్‌ను టీజీపీఎస్సీ తాజాగా విడుద‌ల చేసింది. తాజా షెడ్యూల్‌ ప్రకారం మెయిన్స్‌ పరీక్షలు అక్టోబ‌ర్ 21వ తేదీ నుంచి 27 వ‌ర‌కు నిర్వహించ‌నున్నట్లు పేర్కొన్నారు. మొత్తం మూడు భాషల్లో మెయిన్స్‌ పరీక్షలు జరుగుతాయి. తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ మీడియంల‌లో మెయిన్స్ ప‌రీక్షలు నిర్వహించ‌నున్నారు. ఆయా తేదీల్లో ఒక్కో పేపర్‌ను ఆఫ్‌లైన్‌ విధానంలో..

TGPSC Group 1 Mains 2024 Schedule: టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌ షెడ్యూల్‌ విడుదల.. మొత్తం 6 పేపర్లకు పరీక్ష
TGPSC Group 1 Mains 2024 Schedule
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 13, 2024 | 7:23 AM

హైదరాబాద్‌, జూన్‌ 13: తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ ప‌రీక్షల‌కు సంబంధించిన షెడ్యూల్‌ను టీజీపీఎస్సీ తాజాగా విడుద‌ల చేసింది. తాజా షెడ్యూల్‌ ప్రకారం మెయిన్స్‌ పరీక్షలు అక్టోబ‌ర్ 21వ తేదీ నుంచి 27 వ‌ర‌కు నిర్వహించ‌నున్నట్లు పేర్కొన్నారు. మొత్తం మూడు భాషల్లో మెయిన్స్‌ పరీక్షలు జరుగుతాయి. తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ మీడియంల‌లో మెయిన్స్ ప‌రీక్షలు నిర్వహించ‌నున్నారు. ఆయా తేదీల్లో ఒక్కో పేపర్‌ను ఆఫ్‌లైన్‌ విధానంలో మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల నుంచి సాయంత్రం 5.30 గంట‌ల వ‌ర‌కు నిర్వహించ‌నున్నారు. జూన్‌ 9వ తేదీన గ్రూప్ -1 ప్రిలిమ్స్ ప‌రీక్షను నిర్వహించిన సంగ‌తి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన ఆన్సర్‌ కీ ఈ రోజు విడుదలకానుంది. త్వర‌లోనే ఫ‌లితాల‌ను కూడా విడుద‌ల చేయ‌నున్నారు.

టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్ ప‌రీక్షల షెడ్యూల్ ఇదే..

  • అక్టోబ‌ర్ 21వ తేదీన జ‌న‌ర‌ల్ ఇంగ్లీష్‌ (క్వాలిఫ‌యింగ్ టెస్ట్)
  • అక్టోబ‌ర్ 22వ తేదీ పేప‌ర్ 1 (జ‌న‌ర‌ల్ ఎస్సే)
  • అక్టోబ‌ర్ 23వ తేదీ పేప‌ర్ 2 (హిస్టరీ, క‌ల్చర్ అండ్ జియోగ్రఫీ)
  • అక్టోబ‌ర్ 24వ తేదీ పేప‌ర్ 2 (ఇండియ‌న్ సొసైటీ, రాజ్యాంగం అండ్ గ‌వ‌ర్నెన్స్‌)
  • అక్టోబ‌ర్ 25వ తేదీ పేప‌ర్ 4 (ఎకాన‌మి అండ్ డెవ‌ల‌ప్‌మెంట్)
  • అక్టోబ‌ర్ 26వ తేదీ పేప‌ర్ 5 (సైన్స్ అండ్ టెక్నాల‌జీ అండ్ డాటా ఇంట‌ర్‌ప్రిటేష‌న్)
  • అక్టోబ‌ర్ 27వ తేదీ పేప‌ర్ 6 (తెలంగాణ మూవ్‌మెంట్ అండ్ స్టేట్ ఫార్మేష‌న్)

ప్రతి పేపర్‌కు 3 గంటల సమయంలో పరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో పేపర్కు 150 మార్కుల చొప్పున కేటాయిస్తారు. ఎంపిక చేసుకున్న ఒకే భాషలోనే ఆరు పరీక్షలు రాయవల్సి ఉంటుంది. జనరల్‌ ఇంగ్లిష్‌ పరీక్ష పదోతరగతి స్థాయిలో ఉంటుంది. ఈ పరీక్షలో వచ్చిన మార్కులను ర్యాంకింగ్‌ పరిధిలోకి తీసుకోరు. ఈ పరీక్షలో క్వాలిఫై అయితేనే ఇతర పరీక్షల పేపర్లను మూల్యాంకనం చేస్తారు. అభ్యర్థి నిర్దేశించిన అన్ని పరీక్షలకు తప్పకుండా హాజరు కావాలి. ఇందులో ఏ ఒక్క పరీక్షకు గైర్హాజరైనా అనర్హతకు గురవుతారు. మెయిన్‌ పరీక్షలకు సంబంధించిన సిలబస్, పరీక్ష విధానం వంటి పూర్తి సమాచారం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!