Mulugu Fire Accident: ములుగు జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. ఊరంతా మంటలు.. ప్రజల హాహాకారాలు..!
Mulugu Fire Accident: ములుగు జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ గ్రామం అతా కాలి బూడిదైపోయింది. మంటలు ఆర్పేందుకు ఫైరింజన్లు సైతం అందుబాటులో లేవు.
Mulugu Fire Accident: ములుగు జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ గ్రామం అంతా కాలి బూడిదైపోయింది. ములుగు జిల్లాలోని శనిగాకుంట గ్రామంలో మంటలు చెలరేగాయి. దాదాపు 40 ఇళ్లు మంటల్లో కాలి బూడిదయ్యాయి. గాలి బీభత్సం కారణంగా చెలరేగిన మంటలు.. దావానంలా ఊరంతా వ్యాపించాయి. దాంతో ఆదివాసీలు ప్రాణభయంతో పిల్లలను పట్టుకుని పరుగులు తీశారు. ఈ ప్రమాదంతో 40 గిరిజన కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
ములుగు జిల్లా మంగపేట, కన్నాయిగూడెంలో గాలి దుమారం బీభత్సం సృష్టించింది. ఈ గాలి దుమారం కారణంగా మంగపేట మండలం శనగకుంటలో ఇళ్లకు మంటలు అంటుకున్నాయి. ఆ మంటలు కాస్తా ఊరంతా వ్యాపించి.. భారీగా ఎగసిపడుతున్నాయి. ఆదివాసీ గూడెం మొత్తం అగ్నికి ఆహుతైపోతోంది. గ్రామంలోని గిరిజన కుటుంబాలు చెల్లాచెదురయ్యాయి. అగ్ని ప్రమాదంతో అలర్ట్ అయిన విద్యుత్ అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దాంతో ఆ ప్రాంతం అంతా అంధకారంగా మారింది. చిమ్మచీకట్లలోనే ఊరికి దూరంగా పిల్లలతో సహా పరుగులు తీస్తున్నారు ఆదివాసీ ప్రజలు.