TS Police Recruitment 2022: గుడ్‌న్యూస్! తెలంగాణలో 677 ఉద్యోగాలకు మరో రెండు నోటిఫికేషన్లు విడుదల.. దరఖాస్తు ఇలా..
తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) మరో రెండు విభాగాల్లో పోస్టుల భర్తీకి ఈ రోజు (ఏప్రిల్ 28) నోటిఫికేషన్ విడుదల చేసింది..
TSLPRB Recruitment 2022 Notification for Transport and Excise Constable Posts: తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) మరో రెండు విభాగాల్లో పోస్టుల భర్తీకి ఈ రోజు (ఏప్రిల్ 28) నోటిఫికేషన్ విడుదల చేసింది. పోలీసు రవాణా విభాగం, ఎక్సైజ్ శాఖలతో కలిపి మొత్తం 677 కానిస్టేబుల్ ఉద్యోగాలకు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. వీటిల్లో రవాణా విభాగంలో 63 కానిస్టేబుల్ పోస్టులు, ఎక్సైజ్ శాఖలో 614 పోస్టులు భర్తీ చేయనున్నారు. దరఖాస్తు ప్రక్రియ మే 2 నుంచి ప్రారంభమౌతుంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్ www.tslprb.inలో మే 20 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. కాగా పోలీసు శాఖతో పాటు ఎస్పీఎఫ్, అగ్నిమాపక, జైళ్ల శాఖలో 16,614 పోస్టుల భర్తీకి పోలీసు నియామక మండలి ఇప్పటికే ప్రకటన విడుదల చేసింది. దీంతో మొత్తం నాలుగు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ఉద్యోగాల వారీగా విద్యార్హతలు, వయో పరిమితి, సిలబస్ తదితర వివరాలు వెబ్‌సైట్లో పొందుపరిచామని తెలిపారు. యూనిఫాం పోస్టులకు ఈ నోటిఫికేషన్లోనూ మూడేళ్ల గరిష్ఠ వయోపరిమితి సడలింపు కల్పించింది. అన్ని ఉద్యోగాలకు 2022 జులై 1వ తేదీ నాటికి సంబంధిత విద్యార్హతలో ఉత్తీర్ణులై ఉండాలి.
వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 677
- టాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్ పోస్టులు: 63
- ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులు: 614
వయోపరిమితి: జులై 1, 2022 నాటికి 18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హతలు: జులై 1, 2022 నాటికి ఇంటర్మీడియట్/ తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్ పోస్టులకు తప్పని సరిగా మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా శారీరక ప్రమాణాలు ఉండాలి.
ఎంపిక విధానం: ప్రిలిమినరీ రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్/ ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్, ఫైనల్ రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము:
- జనరల్ అభ్యర్థులకు: రూ.1000
- ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు, రూ.500
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తులకు చివరి తేది: మే 26, 2022.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
Also Read: