Watch Video: కరెన్సీ కాదు చిత్తుపేపర్లు అనుకున్నారు.. కట్ చేస్తే పోలీసుల ఎంట్రీ.. సినిమా మించిన సీన్..

అర్థరాత్రి చిమ్మచీకటి.. మూసి ఉన్న ఏటీఎం ఒక్కసారిగా ఓపెన్ అయ్యింది.. బాక్స్‌లు చేత పట్టుకుని ఎటీఎం నుంచి బయటకొచ్చిన కొందరు వ్యక్తులు.. కట్ చేస్తే పోలీస్ పెట్రోలింగ్ కార్ ఎంట్రీ..

Watch Video: కరెన్సీ కాదు చిత్తుపేపర్లు అనుకున్నారు.. కట్ చేస్తే పోలీసుల ఎంట్రీ.. సినిమా మించిన సీన్..
Korutla Atm Robbery
Follow us

|

Updated on: Jan 15, 2023 | 10:39 AM

అర్థరాత్రి చిమ్మచీకటి.. మూసి ఉన్న ఏటీఎం ఒక్కసారిగా ఓపెన్ అయ్యింది.. బాక్స్‌లు చేత పట్టుకుని ఎటీఎం నుంచి బయటకొచ్చిన కొందరు వ్యక్తులు.. కట్ చేస్తే పోలీస్ పెట్రోలింగ్ కార్ ఎంట్రీ.. ఇక ప్రతీ సీన్ సినిమాను మించినదే. అవును.. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో చోటు చేసుకున్న ఏటీఎం చోరీ ఘటన సంచలనం క్రియేట్ చేస్తుంది.

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఏటీఎం దొంగలు రెచ్చిపోయారు. అర్థరాత్రి ఒంటిగంటకు గుర్తు తెలియని నలగురు వ్యక్తులు కారులో వచ్చి రోడ్డుపై ఉన్న ఎస్‌బిఐ ఏటీఎంలోకి చొరబడ్డారు. ఎటీఎంను బద్దలుకొట్టి చోరీ చేశారు. డబ్బాల్లో నగదు తీసుకుని తమ కారులో పారిపోయే ప్రయత్నం చేశారు. అయితే, పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా దొంగలు కంటపడటంతో.. పట్టుకునే ప్రయత్నం చేశారు. ఇంతలో దొంగలు పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసులు ఆ వాహనాన్ని వెంబడించి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో దొంగలు నగదు బాక్స్‌ను పడేసి వెళ్లిపోయారు. దీంతో నోట్ల కట్టలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. రోడ్డుపై వరుసగా పడిన నోట్లను ప్రజలు సైతం పట్టించుకోలేదు. చిత్తు పేపర్లుగా భావించి లైట్ తీసుకున్నారు. అయితే, పోలీసులు బ్యాంకు అధికారులకు సమాచారం అందించి, రోడ్డుపై పడిన నోట్లను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు రూ. 3 లక్షలకు పైగా విలువైన నోట్లు రోడ్డుపై చిందరవందరగా పడ్డాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

కాగా, ఎస్‌బిఐ ఏటీఎంలో డబ్బు చోరీకి ప్రయత్నించింది నలుగురు దొంగల ముఠాగా పోలీసులు నిర్ధారించారు. గ్యాస్‌కట్టర్లతో ఏటీఎంని కట్‌ చేసి రూ.19 లక్షల సొమ్మును కాజేశారు. వాళ్లను పట్టుకునేందుకు సినీ ఫక్కీలో చేజ్ చేశారు పోలీసులు. దొంగలను అదుపులోకి తీసుకుని, వారు దోచుకున్న డబ్బును కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే, మరికొందరు దొంగలు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Latest Articles