- Telugu News Photo Gallery secunderabad to visakhapatnam Vande Bharat Express Officially On Tracks, Launched By PM Modi, Here are Ticket Rates, Timings
Vande Bharat Express: సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ రయ్.. రయ్.. టికెట్ ఛార్జీలు, టైమింగ్స్ ఇవే..
యువర్ అటెన్షన్ ప్లీజ్.. తెలుగు రాష్ట్రాల మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ పరుగులు పెడుతోంది. ఇదే దక్షిణాదిన రెండో ట్రైన్ కాగా.. తెలుగు రాష్ట్రాల మధ్య మొదటిది.
Updated on: Jan 15, 2023 | 12:00 PM

యువర్ అటెన్షన్ ప్లీజ్.. తెలుగు రాష్ట్రాల మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ పరుగులు పెడుతోంది. సంక్రాంతి పండుగ నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ట్రైన్‌ను ప్రారంభించారు. ఇక ఇదే దక్షిణాదిన రెండో ట్రైన్ కాగా.. తెలుగు రాష్ట్రాల మధ్య మొదటిది. మరి లేట్ ఎందుకు ఈ ట్రైన్‌కు సంబంధించిన టైమింగ్స్, టికెట్ రేట్స్‌పై ఓ లుక్కేద్దాం పదండి.

Vande Bharat Express

విశాఖ నుంచి సికింద్రాబాద్‌కు చైర్ కార్ టికెట్ ధర రూ.1,720, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ టికెట్ ధర రూ.3,170గా ఉంది. అటు సికింద్రాబాద్ - విశాఖ చైర్ కార్ టికెట్ ధర రూ.1665, ఎగ్జిక్యూటివ్ క్లాస్ రూ.3,120గా నిర్ణయించారు. ఇక సికింద్రాబాద్ నుంచి విజయవాడ చైర్ కారు రూ.905గా, ఎగ్జిక్యూటివ్ క్లాస్ రూ.1775గా ఉంది. సికింద్రాబాద్ నుంచి రాజమండ్రికి చైర్ కారు రూ.1365గా, ఎగ్జిక్యూటివ్ క్లాస్ రూ.2485.

మరోవైపు ఈ రైలు రాజమండ్రి, విజయవాడ, ఖమ్మం, వరంగల్ స్టేషన్లలో ఆగుతుంది. రాజమండ్రిలో 2 నిమిషాలు, విజయవాడలో 5 నిమిషాలు, ఖమ్మం, వరంగల్ స్టేషన్లలో ఒక్కో నిమిషం ఈ ట్రైన్ హాల్ట్ అవుతుంది. ఇందులో 14 ఏసీ ఛైర్ కార్లు, 2 ఎగ్జిక్యూటివ్ ఏసీ ఛైర్ కార్ కోచ్‌లు ఉన్నాయి. ఆదివారం మినహా మిగతా రోజుల్లో ఈ రైలు ప్రతీ ఉదయం 5.45 గంటలకు వైజాగ్ స్టేషన్‌లో బయల్దేరి.. మధ్యాహ్నం 2.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. అలాగే సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి మొదలై.. రాత్రి 11.30 గంటలకు విశాఖ చేరుతుంది.

ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య ఉన్న 700 కిలోమీటర్లను కేవలం 8 గంటల 30 నిమిషాల్లో చేరుకుంటుంది. ఈ రెండు నగరాల మధ్య ఇతర రైళ్లతో పోలిస్తే ఈ రైలు సుమారు 3 గంటల సమయాన్ని ఆదా చేస్తుండగా.. దురుంతో కంటే గంటన్నర వ్యవధి ముందే ఈ ట్రైన్ గమ్యస్ధానానికి చేరుతుంది. దురంతో 10 గంటలు, గరీబ్‌రధ్ ఎక్స్‌ప్రెస్ 11.10 గంటలు, ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ 11.25 గంటలు, గోదావరి ఎక్స్‌ప్రెస్ 12.05 గంటలు, ఈస్ట్‌కోస్ట్ 12.40 గంటలు, జన్మభూమి ఎక్స్‌ప్రెస్ 12.45 గంటల్లో సికింద్రాబాద్ నుంచి విశాఖకు చేరుతాయి.

విశాఖ - సికింద్రాబాద్(20833): విశాఖపట్నం - ఉదయం 5.45, రాజమండ్రి - ఉదయం 7.55, విజయవాడ - ఉదయం 10.00, ఖమ్మం - ఉదయం 11.00, వరంగల్ - మధ్యాహ్నం 12.05, సికింద్రాబాద్ - మధ్యాహ్నం 14.15

సికింద్రాబాద్ - విశాఖ(20834): సికింద్రాబాద్ - మధ్యాహ్నం 15.00, వరంగల్ - మధ్యాహ్నం 16.35, ఖమ్మం - మధ్యాహ్నం 17.45, విజయవాడ - రాత్రి 7.00, రాజమండ్రి - రాత్రి 8.58, విశాఖపట్నం - రాత్రి 11.30





























