Bhatti Vikramarka: షర్మిల చేరికపై జాతీయ స్థాయిలో నిర్ణయం తీసుకోలేదు.. భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు..
Bhatti Vikramarka on YS Sharmila: తెలంగాణ జనగర్జన సభతో కాంగ్రెస్ స్పీడు పెంచింది. ఖమ్మంలో రాహుల్ గాంధీ బహిరంగ సభ అనంతరం సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సోమవారం మీడియాతో మాట్లాడారు.
Bhatti Vikramarka on YS Sharmila: తెలంగాణ జనగర్జన సభతో కాంగ్రెస్ స్పీడు పెంచింది. ఖమ్మంలో రాహుల్ గాంధీ బహిరంగ సభ అనంతరం సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సోమవారం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పాలన అవసరమని ప్రజలు గుర్తించారని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కర్నాటక తీర్పు ఇందుకు నిదర్శనమని.. తెలంగాణ ప్రజల్లోనూ మార్పు వచ్చిందని పేర్కొన్నారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్ర విజయం ఇందులో భాగమేనని భట్టి వివరించారు.
రాహుల్ ప్రసంగానికి యువత నుంచి మంచి స్పందన వచ్చిందని భట్టి పేర్కొన్నారు. ఏపీలోనూ కాంగ్రెస్ పార్టీని దీవిస్తారు.. ప్రభుత్వరంగ సంస్థలను తీసుకొచ్చిన చరిత్ర కాంగ్రెస్‌ది అని పేర్కొన్నారు. విశాఖ స్టీల్ కాపాడుకునేలా కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్ ఉంటుందని వివరించారు.
అయితే, వైఎస్ఆర్టీపీ విలీనం, షర్మిల కాంగ్రెస్ లో చేరిక గురించి చర్చ జరుగుతున్న నేపథ్యంలో భట్టి విక్రమార్క పలు కీలక వ్యాఖ్యలు చేశారు. షర్మిలతో ఇంకా చర్చలు జరగలేదని.. ఆమెతో చర్చలు జరిగిన తర్వాత చెబుతామని భట్టి పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో నిర్ణయం తీసుకోలేదని, ఆ తర్వాతే వెల్లడిస్తామని పేర్కొన్నారు.
బీఆర్‌ఎస్.. భారతీయ జనతా పార్టీకి బీ టీమే..
బీఆర్‌ఎస్.. భారతీయ జనతా పార్టీకి బీ టీమేనని మరోసారి ఆరోపించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన మంత్రి కేటీఆర్.. అమిత్ షా ముందు మోకరిల్లిన మాట నిజం కాదా అని ప్రశ్నించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..