Kunja Bojji: భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా బొజ్జి మృతి.. సంతాపం తెలిపిన కమ్యూనిస్ట్ పార్టీల నేతలు!

భద్రాచలం మాజీ శాసన సభ్యులు కుంజా బొజ్జి (95) ఈరోజు మృతి చెందారు. అనారోగ్యంతో కొంతకాలంగా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పోందుతున్న ఆయన  సోమవారం ఉదయం తుది శ్వాస విడిచారు.

Kunja Bojji: భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా బొజ్జి మృతి.. సంతాపం తెలిపిన కమ్యూనిస్ట్ పార్టీల నేతలు!
Kunja Bojji
Follow us

|

Updated on: Apr 12, 2021 | 11:49 AM

Kuja Bojji: భద్రాచలం మాజీ శాసన సభ్యులు కుంజా బొజ్జి (95) ఈరోజు మృతి చెందారు. అనారోగ్యంతో కొంతకాలంగా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన  సోమవారం ఉదయం తుది శ్వాస విడిచారు. కొద్దికాలంగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న కుంజా బొజ్జిని బంధువులు చికిత్స నిమిత్తం అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. ఇంటికి వచ్చిన తర్వాత బొజ్జి ఆరోగ్యం మళ్లీ క్షీణించడంతో భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే, హస్పిటల్‌లో చికిత్స పోందుతూ ఇవాళ ఉదయం ఆయన కన్నుమూశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో భద్రాచలం నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు.

1926లో వీఆర్ పురం మండలం అడవి వెంకన్న గూడెం లో కుంజా బొజ్జి జన్మించారు. సాయుధ తెలంగాణా పోరాటంలో 1950లో అయన గెరిల్లా దళాల కొరియర్ గా పనిచేశారు. తరువాత 1970లో కమ్యూనిస్టు పార్టీలో చేరిన బొజ్జి 1985 నుంచి 1999 వరకూ భద్రాచలం నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.  సీపీఎం పార్టీ తరపున అన్ని ప్రచార కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు. ఏజెన్సీలో గిరిజన, గిరిజనేతరులకు ఎన్నో సేవలందించారు. ఆయన భార్య లాలమ్మ 2018లో చనిపోయారు. బొజ్జికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

మాజీ ఎమ్మెల్యే కుంజా బొజ్జి మరణం పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. కమ్యూనిస్టు పార్టీల నేతలు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఆయన మృతికి సంతాపం తెలిపి నివాళులు అర్పించారు.

Also Read: వరంగల్‌లో మంత్రి కేటీఆర్‌ సుడిగాలి పర్యటన, ప్రారంభోత్సవాలతో ఫుల్ బిజీ, ఏబీవీపీ కార్యకర్తల అడ్డంకులు

జీహెచ్ఎంసీలో కరెంట్ షాక్‌లకు ఇంకెంత మంది బలి కావాలి.? మౌలాలిలో చిన్నారి నిషాంత్ మ‌ృతిపై ట్విట్టర్లో స్పందించిన మంత్రి కేటీఆర

భగవంతుడా...! క్షణాల వ్యవధిలో అతడి జీవితం సమాప్తమైంది..
భగవంతుడా...! క్షణాల వ్యవధిలో అతడి జీవితం సమాప్తమైంది..
శబ్ధం వస్తే రోడ్డుమీద ఎవరైనా పడిపోయారేమో అనుకున్నారు.. కట్ చేస్తే
శబ్ధం వస్తే రోడ్డుమీద ఎవరైనా పడిపోయారేమో అనుకున్నారు.. కట్ చేస్తే
ఒకే బైక్‌పై నలుగురు ప్రయాణం.. ఇంతలోనే అనుకోని ఘటన
ఒకే బైక్‌పై నలుగురు ప్రయాణం.. ఇంతలోనే అనుకోని ఘటన
JEE Main 2024 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. 22 మందికి 100% మార్కులు
JEE Main 2024 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. 22 మందికి 100% మార్కులు
ఒక గంట మ్యూజిక్ ఈవెంట్‏కు కోట్లు వసూలు చేసే ఏకైక సింగర్..
ఒక గంట మ్యూజిక్ ఈవెంట్‏కు కోట్లు వసూలు చేసే ఏకైక సింగర్..
ఘోర ప్రమాదం.. ఆగివున్న లారీని ఢీకొన్న కారు, ఆరుగురు మృతి
ఘోర ప్రమాదం.. ఆగివున్న లారీని ఢీకొన్న కారు, ఆరుగురు మృతి
రూ. 10 వేలలో ఊహకందని ఫీచర్లు.. 100 ఎంపీ కెమెరాతో పాటు..
రూ. 10 వేలలో ఊహకందని ఫీచర్లు.. 100 ఎంపీ కెమెరాతో పాటు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
మరో మల్టీప్లెక్స్‌ ప్రారంభించనున్న మహేష్‌.. ఈసారి ఎక్కడో తెలుసా.?
మరో మల్టీప్లెక్స్‌ ప్రారంభించనున్న మహేష్‌.. ఈసారి ఎక్కడో తెలుసా.?
ఖమ్మం టికెట్‌ కేటాయింపుతో కాంగ్రెస్‌ వ్యూహమేంటి..?
ఖమ్మం టికెట్‌ కేటాయింపుతో కాంగ్రెస్‌ వ్యూహమేంటి..?