AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వరంగల్‌లో మంత్రి కేటీఆర్‌ సుడిగాలి పర్యటన, ప్రారంభోత్సవాలతో ఫుల్ బిజీ, ఏబీవీపీ కార్యకర్తల అడ్డంకులు

KTR Warangal tour : వరంగల్‌ టూర్‌లో మంత్రి కేటీఆర్‌ సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ప్రజల దాహార్తిని తీర్చేందుకు గాను..

వరంగల్‌లో మంత్రి కేటీఆర్‌ సుడిగాలి పర్యటన, ప్రారంభోత్సవాలతో ఫుల్ బిజీ, ఏబీవీపీ కార్యకర్తల అడ్డంకులు
Venkata Narayana
|

Updated on: Apr 12, 2021 | 11:20 AM

Share

KTR Warangal tour : వరంగల్‌ టూర్‌లో మంత్రి కేటీఆర్‌ సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ప్రజల దాహార్తిని తీర్చేందుకు గాను.. ఇంటింటికి మంచినీటి పథకాన్ని ఉగాది కానుకగా ఇవాళ ప్రారంభించారు. అంతే కాదు ఓరుగల్లు టూర్‌లో డబుల్‌ బెడ్‌రూమ్‌ల ప్రారంభోత్సవంతో పాటు పలు సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ పర్యటనలో మంత్రి కేటీఆర్‌.. వరంగల్‌లో 2వేల కోట్లకుపైగా చేపట్టిన పలు అభివృద్ధి పనులకు కేటీఆర్ ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఇక, ఓరుగల్లులో మిషన్ భగీరథ కింద 939 కోట్ల రూపాయల వ్యయం కాగా… అమృత్ పథకం కింద 413 కోట్లు ఖర్చు చేశారు.

వరంగల్‌లో పలు రహదారులు, వరద కాల్వలలు, వైకుంఠ ధామాలకు కేటీఆర్ శంకుస్థాపనలు చేస్తున్నారు. 35 కోట్ల వ్యయంతో నిర్మించిన భద్రకాళీ బండ్, ఆధ్మాత్మిక ప్రశాంతతను చేకూర్చే అగలయ్య గుట్ట జైన మందిరం.. ఆహ్లాదం పంచేలా తీర్చిదిద్దిన పార్కులు, వివిధ జంక్షన్లను మంత్రి ప్రారంభిస్తున్నారు. అటు, పార్టీ నేతలు, కార్యకర్తలతోనూ సమావేశమై… త్వరలో రానున్న గ్రేటర్ వరంగల్ ఎన్నికలపై దిశా నిర్దేశం చేయనున్నారు మంత్రి కేటీఆర్‌. ఇలాఉంటే, వరంగల్‌కు వెళ్లిన మంత్రి కేటీఆర్‌ను ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకునే యత్నం చేశారు. పోచ్చమ్మమైదాన్‌ ప్రాంతంలో అడ్డు రాగా.. వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

కేటీఆర్ పర్యటనతో అధికార పార్టీ మున్సిపల్ ఎన్నికలపై అప్పుడే పూర్తిస్థాయి ఫోకస్‌ పెట్టినట్టు కనిపిస్తోంది. విపక్షాలకు ఛాన్సు లేకుండా ముందుగానే వ్యూహాత్మక ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకు వెళుతోన్నట్టు కనిపిస్తోంది. ఇతర రాజకీయ పార్టీలంతా సాగర్‌ ఉపఎన్నికపై ఫోకస్ పెడితే…టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం వరంగల్‌ పర్యటనతో కొత్త రూట్ మ్యాప్ లో ముందుకెళ్తున్నారు. ఒక్కరోజు టూర్‌లో భాగంగా ఆయన వరంగల్ లోని 66 డివిజన్లలో పర్యటిస్తుండం విశేషం.

Read also : నమ్మించి నయవంచన చేసే మహామాయగాడు, 7 రాష్ట్రాల్లో ఎన్నో నేరాలు, హైటెక్ బుర్రతో ఎన్ ఫీల్డ్ కొట్టేసి 5వేల కిలోమీటర్ల ప్రయాణం