Covid-19: తెలంగాణలో కరోనా ఉధృతి.. జీహెచ్ఎంసీ తరువాత.. ఆ జిల్లాల్లోనే ఎక్కువ కేసులు..
Telangana Corona Updates: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతూనే ఉంది. రోజురోజుకూ ఈ మహమ్మారి కేసులు భారీగా
Telangana Corona Updates: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతూనే ఉంది. రోజురోజుకూ ఈ మహమ్మారి కేసులు భారీగా పెరుగుతున్నాయి. మరణాల సంఖ్య పెరుగుతుండటం కూడా ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలోనే కేసులు నమోదవుతున్నాయి. తాజగా ఆదివారం గత 24 గంటల్లో రాష్ట్రంలో 2,251 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా ఆరుగురు మరణించారు. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌ను సోమవారం ఉదయం విడుదల చేసింది. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,29,529 కి పెరగగా.. మరణాల సంఖ్య 1,765 కి చేరింది.
కాగా.. గత 24 గంటల్లో కరోనా నుంచి 565 మంది కోలుకున్నారు. వీరితో కలిపి మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,05,900 కి చేరింది. నిన్న అత్యధికంగా నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 355, మేడ్చల్ జిల్లాలో 258, నిజామాబాద్ జిల్లాలో 244, రంగారెడ్డి జిల్లాలో 200 చొప్పున అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. ఇదిలాఉంటే.. నిన్న తెలంగాణ రాష్ట్రంలో 79,027 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీరితో కలిపి ఇప్పటివరకూ 1,10,68,003 కరోనా నిర్థారణ పరీక్షలు చేశారు.
కాగా రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తమైంది. కేసుల కట్టడికి చర్యలు తీసుకుంటోంది. మాస్కు లేకుండా బహిరంగంగా తిరిగే వారిపై జరిమానాలు విధిస్తున్నారు. అంతేకాకుండా బహిరంగ సమావేశాలు తదితర వాటిపై ఆంక్షలు విధిస్తున్నారు. అయినప్పటికీ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
Also Read: