India Corona Cases Updates: దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. అత్యధికంగా ఈ రాష్ట్రాల్లోనే..

India Corona Cases Updates: దేశంలో కరోనా రక్కసి విజృంభిస్తోంది. సెకండ్ వేవ్ రూపంలో విపరీతంగా వ్యాప్తి చెందుతోంది. గతేడాది కంటే కూడా వేగంగా సోకుతోంది.

India Corona Cases Updates: దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. అత్యధికంగా ఈ రాష్ట్రాల్లోనే..
Corona
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 12, 2021 | 10:40 AM

India Corona Cases Updates: దేశంలో కరోనా రక్కసి విజృంభిస్తోంది. సెకండ్ వేవ్ రూపంలో విపరీతంగా వ్యాప్తి చెందుతోంది. గతేడాది కంటే కూడా వేగంగా సోకుతోంది. దాంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు భారీ స్థాయిలో నమోదు అవుతున్నాయి. తాజాగా ఇండియాలో 1,68,912 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ విషయాన్ని భారత వైద్యఆరోగ్య శాఖ సోమవారం నాడు వెల్లడించింది. తాజాగా విడుదలైన కరోనా బులెటిన్ ప్రకారం.. దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 1,68,912 మంది కరోనా బారిన పడ్డారు. ఇదే సమయంలో 75,086 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. కాగా, కరోనా ప్రభావంతో దేశ వ్యాప్తంగా 24 గంటల్లో 904 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 12,01,009 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇదిలాఉంటే.. దేశంలో కరోనా ప్రభావం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 1,35,27,717 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 1,21,56,529 మంది కరోనా నుంచి కోలుకుని సురక్షితంగా బయట్టారు. అయితే దురదృష్టావశాత్తు కరోనా ప్రభావంతో దేశంలో ఇప్పటి వరకు 1,70,179 మంది మృత్యు ఒడికి చేరారు.

ఇదిలాఉంటే.. తాజాగా దేశ వ్యాప్తంగా నమోదైన కేసులు, మరణాల్లో అత్యధికంగా మహారాష్ట్రలోనే నమోదు అయ్యాయి. ఈ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 63,294 కొత్త కరోనా కేసులు నమోదవగా.. 349 మరణాలు నమోదు అయ్యాయి. మహారాష్ట్రలో పరిస్థితి రోజు రోజుకు ఉద్రిక్తంగా మారుతోంది. మహారాష్ట్రతో పాటు.. దేశ రాజధాని న్యూఢిల్లీ, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, హర్యానా, పంజాబ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో కరోనా కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. మహారాష్ట్ర, పంజాబ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని జిల్లాల్లో కరోనా కేసులు అధికంగా నమోదవుతుండటంతో కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలతో ప్రత్యేక చర్చలు

కరోనా కేసులు ఇలా ఉంటే.. మరోవైపు వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో స్పీడ్ పెంచాయి ప్రభుత్వ వర్గాలు. దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 29.33 లక్షల వ్యాక్సిన్ వేశారు. మొత్తంగా చూసుకుంటే ఇప్పటి వరకు 10,45 లక్షల డోస్‌లు లబ్ధిదారులకు వేశారు.

Also read:

Robots for Food Delivery: సరికొత్త రోబోట్ ఆవిష్కరణ.. ఆర్డర్ చేయడమే ఆలస్యం మీ ఇంటికే సరుకులు తెచ్చి ఇస్తుంది..!

ఆలూచిప్స్ ఎక్కువగా తింటున్నారా..! అయితే మీ పని ఔట్‌.. ఒక్కసారి ఈ విషయాలు తెలుసుకోండి..?