AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Virus: సుప్రీం కోర్టు సిబ్బందిలో దాదాపు సగం మందికి కరోనా పాజిటివ్.. వర్చువల్ విధానంలో కేసుల విచారణ

కరోనా మహమ్మారి రెండోసారి తీవ్రంగా విరుచుకుపడుతోంది. అక్కడా ఇక్కడా అని కాకుండా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్నాయి.

Corona Virus: సుప్రీం కోర్టు సిబ్బందిలో దాదాపు సగం మందికి కరోనా పాజిటివ్.. వర్చువల్ విధానంలో కేసుల విచారణ
Corona Virus
KVD Varma
|

Updated on: Apr 12, 2021 | 10:58 AM

Share

Corona Virus:  కరోనా మహమ్మారి రెండోసారి తీవ్రంగా విరుచుకుపడుతోంది. అక్కడా ఇక్కడా అని కాకుండా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్నాయి. ఓ పక్క వ్యాక్సినేషన్ జరుగుతోంది.. మరోపక్క కోవిడ్ నిబంధనలను కచ్చితంగా అమలు చేసేలా ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయినప్పటికీ కరోనా కేసులు పెరిగిపోతుండటం దేశవ్యాప్తంగా ఆందోళన రేకెత్తిస్తోంది.

ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు సిబ్బందిలో దాదాపు 50 శాతం మంది కరోనా బారిన పడినట్టు పలు జాతీయ వార్తా సంస్థలు పేర్కొన్నాయి. మొన్న శనివారం ఒక్కరోజే సుప్రీం కోర్టు సిబ్బందిలో 44 శాతం మందికి కరోనా పాజిటివ్ గా తేలినట్టు తెలిసింది. దీంతో న్యాయమూర్తులు వర్చువల్ విధానంలోకేసుల విచారణ చేపట్టనున్నారని సుప్రీం కోర్టు వర్గాలు చెప్పాయి. కరోనా మొదట దఫా విరుచుకు పడిన సమయంలో సుప్రీం కోర్టులో కేసులు వర్చువల్ విధానంలోనే విచారణ చేసిన విషయం తెలిసిందే. సుప్రీం కోర్టులో అనేక మంది సిబ్బంది.. లా క్లర్కులు కరోనా బారిన పడుతుండటంతో న్యాయమూర్తులు ఈ నిర్ణయం తీసుకున్నారని ఆ వర్గాలు చెబుతున్నాయి.

ఇదిలా ఉంటె ఈరోజు సుప్రీం కోర్టులో పలు బెంచ్ లు రోజూ ప్రారంభం అయ్యే సమయం కంటే, గంట ఆలస్యంగా మొదలు కానున్నాయి. రోజూ ఉదయం 10:30 గంటలకు ప్రారంభమయ్యే బెంచీలు ఉదయం 11:30 గంటలకు, 11 గంటలకు మొదలయ్యే బెంచీలు మధ్యాహ్నం 12 గంటలకు విచారణ ప్రారంభించనున్నాయని సుప్రీంకోర్టు అదనపు రిజిస్ట్రార్ ఒక ప్రకటనలో తెలిపారు. రిజిస్ట్రీ ముందు అత్యవసర కేసులను కూడా ఆన్లైన్ లోనే ప్రస్తావించాలని తెలిపారు.

ఇదిలా ఉండగా, తాజాగా సోమవారం ఇండియాలో 1,68,912 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ విషయాన్ని భారత వైద్యఆరోగ్య శాఖ విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం.. దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 1,68,912 మంది కరోనా బారిన పడ్డారు. ఇదే సమయంలో 75,086 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. కాగా, కరోనా ప్రభావంతో దేశ వ్యాప్తంగా 24 గంటల్లో 904 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 12,01,009 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇదిలాఉంటే.. దేశంలో కరోనా ప్రభావం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 1,35,27,717 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 1,21,56,529 మంది కరోనా నుంచి కోలుకుని సురక్షితంగా బయట్టారు. అయితే దురదృష్టావశాత్తు కరోనా ప్రభావంతో దేశంలో ఇప్పటి వరకు 1,70,179 మంది మృత్యు ఒడికి చేరారు.

Also Read: Lockdown News: మహారాష్ట్రలో పూర్తి స్థాయి లాక్‌డౌన్? ఉద్ధవ్ సర్కారు నిర్ణయం ఎప్పుడంటే?

Lockdown News: మహారాష్ట్రలో పూర్తి స్థాయి లాక్‌డౌన్? ఉద్ధవ్ సర్కారు నిర్ణయం ఎప్పుడంటే?