Robots for Food Delivery: సరికొత్త రోబోట్ ఆవిష్కరణ.. ఆర్డర్ చేయడమే ఆలస్యం మీ ఇంటికే సరుకులు తెచ్చి ఇస్తుంది..!

Robots for Food Delivery: ప్రస్తుత కాలంలో అంతా టెక్నాలజీనే పైచేయి సాధిస్తోంది. ప్రతీ పనికి టెక్నాలజీ అవసరం అవుతోంది. మనుషులు పూర్తిగా టెక్నాలజీపైనే..

Robots for Food Delivery: సరికొత్త రోబోట్ ఆవిష్కరణ.. ఆర్డర్ చేయడమే ఆలస్యం మీ ఇంటికే సరుకులు తెచ్చి ఇస్తుంది..!
Robot
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 12, 2021 | 9:55 AM

Robots for Food Delivery: ప్రస్తుత కాలంలో అంతా టెక్నాలజీనే పైచేయి సాధిస్తోంది. ప్రతీ పనికి టెక్నాలజీ అవసరం అవుతోంది. మనుషులు పూర్తిగా టెక్నాలజీపైనే ఆధారపడుతున్నారు. ఈ క్రమంలో టెక్ దిగ్గజాలు కూడా కొత్త యంత్రాలను, యంత్ర పరికరాలను ఆవిష్కరిస్తున్నాయి. వీటిలో ముఖ్యంగా మనుషులకు ఉపయుక్తమైనవి రోబోట్‌ లుగా చెప్పవచ్చు. కంపెనీల్లో పని మొదలు.. ఇంట్లో పని మనిషి చేసే పని వరకు అన్నింటికీ రోబోట్‌ లను ఉపయోగించడం జరుగుతోంది. టెక్ సంస్థలు కూడా మనుషుల అవసరాలకు తగ్గట్లుగా కొత్త కొత్త రోబోట్‌ లను తయారు చేసి మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో రకాల రోబోట్‌ లను మనం చూశాం. హోటళ్లలో ఆహారం వడ్డించడానికి, ఇంటిని చక్కదిద్దడానికి, షాప్ కౌంటర్లలో కూర్చునే రోబోట్‌ లు చాలా వినియోగంలో ఉన్నాయి. ఇప్పుడు మరో రోబో కూడా అందుబాటులోకి వచ్చింది. సరుకులను డోర్ డెలివరీ చేసే రోబో అందుబాటులోకి వచ్చింది. మీ ఇంట్లో రేషన్ సరుకు అయిపోయినా.. పాల ప్యాకెట్ అవసరం పడినా.. ఆ రోబో మీ ఇంటికి తెచ్చి ఇస్తుంది. అవును.. రేషన్ సరుకుల డిస్ట్రిబ్యూషన్ కోసం OTSAW డిజిటల్ కంపెనీ ఒక రోబోను సృష్టించింది. దానికి కామెల్లో అని పేరు కూడా పెట్టారు. ఏడాది పాటు ఈ రోబోట్‌ పరిశీలించారు. ఈ ఏడాది కాలంలో దాదాపు 700 గృహాలకు రేషన్ సరుకులను పంపిణీ చేసింది.

ఈ రోబోట్‌ గురించి సదరు కంపెనీ ప్రతినిధులు ఆసక్తికర వివరాలు వెల్లడించారు. వినియోగదారులు ఇకపై డెలివరీ స్లాట్లను సులభంగా బుక్ చేసుకోవచ్చునని అన్నారు. పాలు, గుడ్లు వంటి రేషన్ సరుకులను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే.. ఈ రోబోట్‌ లు వినియోగదారుల ఇళ్లకే తీసుకువస్తాయని చెప్పారు. ఆర్డర్ డెలివరీ సమయంలో రోబోట్ మీ ఇంటికి వచ్చినప్పుడు.. మీ ఫోన్‌కు మెసేజ్ పంపిస్తుంది. కాగా, ఈ రోబోట్లలో 3డి సెన్సార్లు, కెమెరా సహా రెండు కంపార్ట్‌మెంట్లు ఉన్నాయని కంపెనీ ప్రతినిథులు తెలిపారు. వీటి సహాయంతో 20 కిలోల ఫుడ్ పార్శిళ్లను డెలివరీ చేస్తుందని పేర్కొన్నారు. ఈ రోబోట్‌లు రోజులో 4 డెలివరీలు చేస్తుందన్నారు. డెలివరీ తరువాత ఆ రోబోట్‌ను శానిటైజ్ చేయడానికి ప్రత్యేక ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇక, OTSAW డిజిటల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ లింగ్ టింగ్ మింగ్ మాట్లాడుతూ.. ‘కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కాంటాక్ట్‌లెస్ సేవను కోరుకుంటున్నారు. అటువంటి పరిస్థితిలో ఈ రోబోట్లు చాలా ఉపయుక్తంగా ఉంటాయి. ఈ రోబోట్ ద్వారా కస్టమర్లు తమ సమయాన్ని ఆదా చేసుకోవడమే కాకుండా.. వైరస్ బారిన పడకుండా ఉండవచ్చు.’ అని చెప్పుకొచ్చారు.

Also read:

ఎండకాలంలో మంచిదని పుచ్చకాయను ఎక్కువగా తింటున్నారా ? అయితే జాగ్రత్త.. ఈ సమస్యలు గురించి తెలుసుకోవాల్సిందే..

Haridwar Kumbh 2021: హరిద్వార్‌లో పోటెత్తిన భక్తులు.. కనిపించని కోవిడ్ నిబంధనలు.. అధికారుల్లో ఆందోళన