Haridwar Kumbh 2021: హరిద్వార్‌లో పోటెత్తిన భక్తులు.. కనిపించని కోవిడ్ నిబంధనలు.. అధికారుల్లో ఆందోళన

Haridwar Kumbh Mela 2021: ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో కుంభమేళా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో భక్తులు హరిద్వార్‌కు భారీగా చేరుకోని

Haridwar Kumbh 2021: హరిద్వార్‌లో పోటెత్తిన భక్తులు.. కనిపించని కోవిడ్ నిబంధనలు.. అధికారుల్లో ఆందోళన
Haridwar Kumbh Mela 2021
Follow us

|

Updated on: Apr 12, 2021 | 9:46 AM

Haridwar Kumbh Mela 2021: ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో కుంభమేళా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో భక్తులు హరిద్వార్‌కు భారీగా చేరుకోని రెండో షాహీ స్నానాలను ఆచరిస్తున్నారు. కుంభమేళా గంగా హారతిని పురస్కరించుకొని గంగానదిలో సోమవారం, బుధవారం భక్తులు షాహీ స్నానాలు ఆచరించనున్నారు. ఈ మేరకు ఉత్తరఖండ్ ప్రభుత్వం గంగా జలాల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు ఇప్పటికే పలు ఏర్పాట్లు చేసింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కోవిడ్-19 నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ఆదేశించింది. అయినప్పటికీ.. నిబంధనల ఉల్లంఘన యథేచ్చగా జరుగుతోంది. భక్తులు గుంపులు గుంపులుగా కనిపిస్తున్నారు. ఎన్ని చర్యలు చేపట్టినా.. ఇలా జరుగుతుండటంపై పలువురు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

హరిద్వార్‌లో పోటెత్తిన భక్తులు వీడియో..

కోవిడ్ నిబంధనల ఉల్లంఘనపై ఐజీ సంజయ్ గుంజాయన్ మీడియా సంస్థతో మాట్లాడారు. తాము ఇక్కడికి వచ్చే భక్తులతో కరోనా నియమాలు గురించి పదే పదే చెబుతున్నప్పటికీ, చాలామంది పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరికి వారు వ్యక్తిగతంగా కరోనా సోకకుండా జాగ్రత్త పడితేనే వైరస్‌ను అదుపు చేయగలమంటూ ఆవేదన వ్యక్తంచేశారు. భౌతిక దూరం పాటించాలని కోరారు. ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి సామాన్య భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు అనుమతిస్తున్నామని తెలిపారు.

ఇదిలాఉంటే.. హరిద్వార్‌కు వచ్చే భక్తులకు ఎప్పటికప్పుడు కరోనా పరీక్షలు చేస్తున్నారు. తాజాగా చాలా మంది వరకూ కరోనా పాజిటివ్‌గా తేలిందని అధికారులు వెల్లడించారు. షాహీ స్నాన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన 372 మంది భక్తులకు కరోనావైరస్ సోకినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో ప్రముఖులు కూడా ఉన్నట్లు సమాచారం. 12 ఏళ్లకు ఓ సారి జరుగుతున్న మహా కుంభమేళా కావడంతో భక్తులు భారీగా చేరుకుంటున్నారు.

Also Read:

Inspirational Journey: ఎన్నో కష్టాలు, మరెన్నో నిద్రలేని రాత్రులు.. నెట్‌ వాచ్‌మెన్ నుంచి ఐఐఎం రాంచి ప్రొఫెసర్‌గా ఎదిగాడు..

Petrol and Diesel Price : స్థిరంగా ఉన్న ఇంధన ధరలు.. దేశంలోని వివిధ నగరాల్లో లీటర్‌ పెట్రోల్‌ రేట్‌ ఇలా..?

పనిచేసే బ్యాంకుకే కన్నం వేసిన ఉద్యోగి.. ఎంత బంగారం దోచుకెళ్లాడంటే
పనిచేసే బ్యాంకుకే కన్నం వేసిన ఉద్యోగి.. ఎంత బంగారం దోచుకెళ్లాడంటే
వచ్చే ఎన్నికల్లో వైసీపీని భూస్థాపితం చేస్తాం.. చంద్రబాబు
వచ్చే ఎన్నికల్లో వైసీపీని భూస్థాపితం చేస్తాం.. చంద్రబాబు
రైలులో తనిఖీలు.. ఓ బ్యాగ్‌ తెరిచి చూడగా బిత్తరపోయిన పోలీసులు..
రైలులో తనిఖీలు.. ఓ బ్యాగ్‌ తెరిచి చూడగా బిత్తరపోయిన పోలీసులు..
ఉదయం కాఫీ తాగితే ఇంత ప్రమాదమా.? హెచ్చరిస్తున్న నిపుణులు
ఉదయం కాఫీ తాగితే ఇంత ప్రమాదమా.? హెచ్చరిస్తున్న నిపుణులు
ఘనంగా గామా అవార్డుల ప్రధానోత్సవం.. పాల్గొన్న సినీ ప్రముఖులు..
ఘనంగా గామా అవార్డుల ప్రధానోత్సవం.. పాల్గొన్న సినీ ప్రముఖులు..
చెప్పు చూపించి.. వార్నింగ్ ఇచ్చి.. ఎంపీ మార్గాని వీడియో వైరల్
చెప్పు చూపించి.. వార్నింగ్ ఇచ్చి.. ఎంపీ మార్గాని వీడియో వైరల్
ఆర్ఆర్ కోసం జెర్సీ డిజైన్ చేసిన చాహల్.. వీడియో చూశారా..
ఆర్ఆర్ కోసం జెర్సీ డిజైన్ చేసిన చాహల్.. వీడియో చూశారా..
కారు కొనుగోలుపై రూ.1.20 లక్షల వరకు తగ్గింపు.. దిమ్మదిరిగే ఆఫర్‌
కారు కొనుగోలుపై రూ.1.20 లక్షల వరకు తగ్గింపు.. దిమ్మదిరిగే ఆఫర్‌
డయాబెటిస్‌ బాధితులు ఉల్లిపాయ తినొచ్చా.. నిపుణులు ఏం చెబుతున్నారు
డయాబెటిస్‌ బాధితులు ఉల్లిపాయ తినొచ్చా.. నిపుణులు ఏం చెబుతున్నారు
తిరుపతి అసెంబ్లీ బరిలో టీడీపీనా.. జనసేనా..? ఆశావాహుల్లో ఉత్కంఠ..
తిరుపతి అసెంబ్లీ బరిలో టీడీపీనా.. జనసేనా..? ఆశావాహుల్లో ఉత్కంఠ..