Corona : తెలుగు రాష్ట్రాల్లోనూ విజృంభిస్తోన్న కరోనా, రోజూ వందల్లో వచ్చే కేసులు.. ఒక్కసారిగా వేలల్లోకి

Corona : తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా విజృంభిస్తోంది. రోజూ వందల్లో వచ్చే కేసులు.. ఒక్కసారిగా వేలల్లోకి చేరుకున్నాయి. మరణాలు కూడా పెరుగుతున్నాయి...

Corona : తెలుగు రాష్ట్రాల్లోనూ విజృంభిస్తోన్న కరోనా,  రోజూ వందల్లో వచ్చే కేసులు.. ఒక్కసారిగా వేలల్లోకి
Corona Cases In India
Follow us
Venkata Narayana

|

Updated on: Apr 12, 2021 | 10:06 AM

Corona : దేశవ్యాప్తంగా  కోరలు చాస్తున్నట్టే..  తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా విజృంభిస్తోంది. రోజూ వందల్లో వచ్చే కేసులు.. ఒక్కసారిగా వేలల్లోకి చేరుకున్నాయి. మరణాలు కూడా పెరుగుతున్నాయి. ఏపీలో దాదాపు ఆరున్నర నెలల తర్వాత మళ్లీ అత్యధిక కొవిడ్‌ పాజిటివిటీ రేటు నమోదైంది. గతేడాది సెప్టెంబరు 23న 10.97 శాతం పాజిటివిటీ రేటు నమోదై.. ఆ తర్వాత నుంచి క్రమంగా తగ్గుతూ వచ్చింది. మళ్లీ ఇప్పుడు 11.01 శాతానికి చేరింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 31,719 నమూనాలను పరీక్షించగా.. 3,495 మందికి కరోనా ఉన్నట్లు తేలింది. ఈ మహమ్మారి బారిన పడి తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు.

ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 9 లక్షల 25,401కు, మరణాలు 7,300కు చేరాయి. చిత్తూరు, గుంటూరు, విశాఖపట్నం జిల్లాల్లోనే 50 శాతం కేసులు నమోదయ్యాయి. ఉభయగోదావరి మినహా మిగతా అన్ని జిల్లాల్లోనూ వందకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 20,954 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొవిడ్‌-19 మహమ్మారి మళ్లీ పెద్దఎత్తున వ్యాపిస్తున్నందున ప్రజలంతా మరింత జాగ్రత్తగా ఉండాలని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ సూచించారు. పిల్లలు, వృద్ధుల కోసమైనా ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలని ప్రకటనలో కోరారు. మరోవైపు రాష్ట్రంలో పలు చోట్ల కరోనా వ్యాక్సిన సరిపడా అందుబాటులో లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇక తెలంగాణలో ఒక్కరోజులోనే 3,187 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో గతేడాది మార్చి 2న తొలి కేసు నమోదైనప్పటి నుంచి ఇప్పటివరకూ ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. గతేడాది ఆగస్టు 25న 3,018 కేసులు నమోదయ్యాయి. గత 10 రోజులతో పోల్చితే పాజిటివ్‌ రేటు రెండింతలకు పైగా పెరిగింది. కొత్తగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3 లక్షల 27,278కి పెరిగింది. గత 6 వారాలుగా కొవిడ్‌ నుంచి కోలుకునేవారి సంఖ్య కూడా క్రమంగా తగ్గుతోంది. నెలన్నర కిందట కోలుకునేవారి శాతం 98కి పైగా నమోదు కాగా.. ప్రస్తుతం 93.29 శాతానికి తగ్గింది. ఈ విషయంలో జాతీయ సగటు 90.4 శాతం ఉంది.

Read also : Police attack : పోలీసుల దాష్టీకం, వృత్తిధర్మం, మానవత్వం మరిచి కరోనా పేషంట్‌, కుటుంబ సభ్యులపై వికృత చేష్టలు