Police attack : పోలీసుల దాష్టీకం, వృత్తిధర్మం, మానవత్వం మరిచి కరోనా పేషంట్, కుటుంబ సభ్యులపై వికృత చేష్టలు
Madhya Pradesh Police brutally attacked : మధ్యప్రదేశ్ పోలీసుల దాష్టీకం మరోసారి బయటపడింది.
Madhya Pradesh Police brutally attacked : మధ్యప్రదేశ్ పోలీసుల దాష్టీకం మరోసారి బయటపడింది. మానవత్వం మరిచిన పోలీసులు కరోనా పేషంట్‌ను చితకబాదారు . లాఠీలతో ఇష్టం వచ్చినట్టు కొట్టారు. అడ్డుకున్న కుటుంబసభ్యులను కూడా గొడ్డును బాదినట్టు బాదారు. అమానుషమైన ఈ ఘటన ఖాండ్వాలో జరిగింది. పోలీసులు దాడిలో కరోనా పేషంట్‌తో సహా కుటుంబసభ్యులకు తీవ్రగాయాలయ్యాయి.
కొద్దిరోజుల క్రితం బంజరి గ్రామానికి చెందిన యువకుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆరోగ్యశాఖ సిబ్బంది ఆ యువకుడికి ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు వచ్చారు. అయితే తాను ఆశా కార్యకర్త అని , తన కుమారుడు ఇంట్లోనే కరోనా చికిత్స తీసుకుంటాడని ఆ యువకుడి తల్లి ఆరోగ్యశాఖ సిబ్బందితో వాగ్వాదానికి దిగింది. హెల్త్ వర్కర్లపై కరోనా పేషంట్ కుటుంబసభ్యులు దాడి చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో బంజరి గ్రామానికి చేరుకున్న పోలీసులు నరరూప రాక్షసుల్లా ప్రవర్తించారు. కరోనా పేషంట్‌తో సహా కుటుంబ సభ్యులను చితకబాదారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇద్దరు పోలీసులను బదిలీ చేశారు ఉన్నతాధికారులు.
In Khandwa dist, MP Police brutally beat up with lathis and pipes, the corona patient and their family members, including women. Further, police also lodged FIR against the victim family. Arrest these police goons soon. @ChouhanShivraj pic.twitter.com/Gxu83DnvXL
— Suraj Kumar Bauddh (@SurajKrBauddh) April 11, 2021