Covid-19 patient: మధ్యప్రదేశ్‌లో అమానుషం.. కరోనా బాధితుడిని చితకబాదిన పోలీసులు.. వీడియో..

Attack on Covid-19 Patient: మధ్యప్రదేశ్‌లోని ఖండ్వాలో దారుణ సంఘటన జరిగింది. ఇద్దరు పోలీసులు కలిసి క‌రోనా రోగిని చిత‌క‌బాదారు. దీంతో

Covid-19 patient: మధ్యప్రదేశ్‌లో అమానుషం.. కరోనా బాధితుడిని చితకబాదిన పోలీసులు.. వీడియో..
Attack On Covid 19 Patient Mp
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 12, 2021 | 10:09 AM

Attack on Covid-19 Patient: మధ్యప్రదేశ్‌లోని ఖండ్వాలో దారుణ సంఘటన జరిగింది. ఇద్దరు పోలీసులు కలిసి క‌రోనా రోగిని చిత‌క‌బాదారు. దీంతో ఆ ఇద్దరు పోలీసులను అధికారులు సస్పెండ్ చేశారు. ఈ సంఘ‌ట‌న ఖండ్వాలోని చైగావ్ మఖన్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని సిర్సోడ్ బంజారీ గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ షేర్ చేసి.. పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతోపాటు పలువురు కూడా ఈ వీడియోపై స్పందించడంతో.. పోలీసులు దీనిపై స్పందించారు.

సిర్సోడ్ బంజరీ గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువకుడికి క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. ఈ క్రమంలో కరోనా రోగిని ఆసుపత్రికి త‌ర‌లించేందుకు ఆరోగ్య సిబ్బంది అక్కడికి వెళ్లి కుటుంబసభ్యులతో మాట్లాడారు. దీంతో కరోనా రోగి కుటుంబసభ్యులు అతిన్ని తీసుకెళ్లేందుకు నిరాకరించారు. దీంతో ఆరోగ్య సిబ్బంది, వారి మధ్య మాటమాట పెరిగింది. రోగి బంధువులు సిబ్బందిపై దాడి చేశారు. అనంతరం బంధీగా ఉంచారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఖండ్వాలోని కరోనా రోగి ఇంటికి చేరుకున్నారు. కుటుంబసభ్యులను సముదాయిస్తున్న తరుణంలో రోగి కుటుంబం పోలీసులపై కూడా దాడి చేయడం ప్రారంభించిందని ఖండ్వా సుపరింటెండెంట్ వెల్లడించారు. దీంతో ప్రతీకారంగా క‌రోనా రోగితో పాటు అత‌ని కుటుంబ స‌భ్యుల‌ను పోలీసులు కొట్టారని వెల్లడించారు.

భీమ్ ఆర్మీ చీఫ్ షేర్ చేసిన వీడియో..

ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైర‌ల్ కావడంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం సిరీయస్ అయింది. దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించింది. కాగా.. ఈ వీడియోల‌పై ఖండ్వా ఎస్పీ వివేక్ సింగ్ మాట్లాడుతూ.. క‌రోనా రోగిపై దాడి చేసిన ఇద్దరు పోలీసుల‌ను స‌స్పెండ్ చేసిన‌ట్లు వెల్లడించారు. దీంతోపాటు ఆరోగ్య సిబ్బంది, పోలీసులపై దాడి చేసిన కరోనా రోగి కుటుంబసభ్యులపై కూడా కేసు నమోదు చేసినట్లు వివేక్ సింగ్ తెలిపారు. ఈఘటనపై దర్యాప్తు కొనసాగుతుందని పేర్కొన్నారు.

ఇదిలాఉంటే.. మధ్యప్రదేశ్‌లో కూడా కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటికే ప్రభుత్వం పలు కఠిన ఆంక్షలను అమలు చేస్తోంది. అయినప్పటికీ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ మేరకు పలు ప్రాంతాల్లో ఇప్పటికే నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నారు.

Also Read:

Haridwar Kumbh 2021: హరిద్వార్‌లో పోటెత్తిన భక్తులు.. కనిపించని కోవిడ్ నిబంధనలు.. అధికారుల్లో ఆందోళన

మీకు జీరో బ్యాలెన్స్ అకౌంట్‌ ఉందా..! అయితే SBI లెక్కలు తెలుసుకోవాల్సిందే.. లేదంటే కష్టమే..?

ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
'మీరు మాత్రం క్షమించకండి సార్'.. పోసాని క్షమాపణలపై నిర్మాత ట్వీట్
'మీరు మాత్రం క్షమించకండి సార్'.. పోసాని క్షమాపణలపై నిర్మాత ట్వీట్
అంబానీ కారు డ్రైవర్​ జీతం ఎంతో తెలుసా ?? అసలు కథ ఇది !!
అంబానీ కారు డ్రైవర్​ జీతం ఎంతో తెలుసా ?? అసలు కథ ఇది !!
ఇండియాలోనే ఉన్నానా ?? నమ్మలేకపోయిన జపాన్ టూరిస్ట్
ఇండియాలోనే ఉన్నానా ?? నమ్మలేకపోయిన జపాన్ టూరిస్ట్