మీకు జీరో బ్యాలెన్స్ అకౌంట్‌ ఉందా..! అయితే SBI లెక్కలు తెలుసుకోవాల్సిందే.. లేదంటే కష్టమే..?

SBI Zero Balance Account Holders : జీరో బ్యాలెన్స్ లేదా బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్స్‌పై ఎస్బీఐ వడ్డింపు మామూలుగా లేదు.. అకౌంట్‌ హోల్డర్స్‌కి అందించే సేవలపై అధిక చార్జీలను వసూలు చేస్తుంది.

మీకు జీరో బ్యాలెన్స్ అకౌంట్‌ ఉందా..! అయితే SBI లెక్కలు తెలుసుకోవాల్సిందే.. లేదంటే కష్టమే..?
Sbi Zero Balance Account
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Apr 12, 2021 | 9:47 AM

SBI Zero Balance Account Holders: జీరో బ్యాలెన్స్ లేదా బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్స్‌పై ఎస్బీఐ వడ్డింపు మామూలుగా లేదు.. అకౌంట్‌ హోల్డర్స్‌కి అందించే సేవలపై అధిక చార్జీలను వసూలు చేస్తుంది. ఐఐటి-బొంబాయి అధ్యయనంలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ లెక్క ప్రకారం.. 2015-20 మధ్య కాలంలో ఎస్బీఐ దాదాపు 12 కోట్ల బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్(బీఎస్‌బిడిఎ) హోల్డర్ల నుంచి రూ.300 కోట్లకు పైగా వసూలు చేసినట్లు నివేదికలో పేర్కొంది. జీరో బ్యాలెన్స్ ఖాతాదారులు నాలుగు లావాదేవీల కంటే ఎక్కువగా చేస్తే ప్రతీ లావాదేవీకి రూ.17.70 వసూలు చేసినట్లు తెలిసింది.

అయితే ఎస్బీఐ మాత్రమే కాదు ఇందులోకి పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కూడా చేరింది. ఈ బ్యాంకు 3.9 కోట్ల బీఎస్‌బిడిఎ ఖాతాల నుంచి రూ.9.9 కోట్లు వసూలు చేసింది. ఇలా చాలా బ్యాంకులు జీరో బ్యాలెన్స్ లేదా బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్లపై గల ఆర్బీఐ నిబంధనలు తుంగలోకి తొక్కుతున్నాయి. ఇష్టారీతిన చార్జీలను వసూలు చేస్తున్నట్లు ఐఐటి-బొంబాయి అధ్యయనంలో తేలింది. 2013 సెప్టెంబర్ ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం.. బీఎస్‌బీడిఎపై ఛార్జీలు వసూలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఎస్బీఐ గరిష్ట సంఖ్యలో బీఎస్‌బిడిఎలను నిర్వహిస్తుంది. ప్రతి డెబిట్ లావాదేవీపై (డిజిటల్ మార్గాల ద్వారా కూడా) నెలకు నాలుగు దాటిన ప్రతిసారి 17.70 రూపాయలు వసూలు చేస్తుంది. 2018-19 కాలంలో రూ.72 కోట్ల వసూలు చేస్తే 2019-20 రూ.158 కోట్లు వసులు చేసినట్లు” ఐఐటి బొంబాయి ప్రొఫెసర్ ఆశిష్ దాస్ అధ్యయనం పేర్కొంది.

ఒకవైపు కేంద్రం డిజిటల్ చెల్లింపులను పెంచాలని చూస్తుంటే.. ఎస్బీఐ మాత్రం ఖాతాదారులను నిరుత్సాహపరుస్తుంది. ఆర్బీఐ.. బ్యాంకులపై నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ఖాతాదారులు కోరుతున్నారు. కచ్చితంగా ఆజమాయిషీ ఉండాలని చెబుతున్నారు. లేదంటే బ్యాంకులు ఇష్టారీతిన ఛార్జీలు వసూలు చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణ పౌరులు తీసుకునే జీరో బ్యాలెన్స్‌ అకౌంట్లపై ఇంత పెద్దమొత్తంలో ఛార్జీలు వసూలు చేయడం తగదన్నారు. దేశంలో ప్రతి ఒక్కరికి ఖాతా ఉండాలని చెప్పేది ఇందుకోసమేనా అని ప్రశ్నిస్తున్నారు? వీటిపై నిరసనలు వెల్లువెత్తకముందే ఆర్బీఐ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Inspirational Journey: ఎన్నో కష్టాలు, మరెన్నో నిద్రలేని రాత్రులు.. నెట్‌ వాచ్‌మెన్ నుంచి ఐఐఎం రాంచి ప్రొఫెసర్‌గా ఎదిగాడు..

Horoscope Today: ఈరోజు ఈరాశివారు ఉద్యోగాలు, ఆస్తి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి.. ఈరోజు రాశిఫలాలు..

Sehwag Coments : ధోనిపై ఆగ్రహించిన ద్రావిడ్‌..! కారణం ఇదేనని చెబుతున్న ఇండియన్‌ డాషింగ్‌ ఓపెనర్

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.