Inspirational Journey: ఎన్నో కష్టాలు, మరెన్నో నిద్రలేని రాత్రులు.. వాచ్‌మెన్ నుంచి ఐఐఎం రాంచి ప్రొఫెసర్‌గా ఎదిగాడు..
Inspirational Journey: ‘కృషి ఉంటే మనుషులు రుషులవుతారు.. మహా పురుషులవుతారు’ అంటుంటారు. అచ్చంగా ఆ మాటలను రుజువు చేశాడు..
Inspirational Journey: ‘కృషి ఉంటే మనుషులు రుషులవుతారు.. మహా పురుషులవుతారు’ అంటుంటారు. అచ్చంగా ఆ మాటలను రుజువు చేశాడు ఓ వాచ్‌మెన్. వాచ్‌మెన్ నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయికి ఎదిగి ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా మారారు. కేరళలలోని కాసరగోడ్‌కు చెందిన రంజిత్ రామచంద్రన్(28) రాత్రి పూట వాచ్‌మెన్‌గా పని చేసుకుంటూ.. ఐఐఎం రాంచిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయికి ఎదిగారు. ఈ సంతోషాన్ని నెటిజన్లతో పంచుకున్న రంజిత్ రామచంద్రన్.. తాను జన్మించిన గుడిసె(ఇళ్లు) చిత్రాన్ని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ‘‘ఒక ఐఐఎం ప్రొఫెసర్ ఇక్కడ జన్మించాడు’’ అని క్యాప్షన్ పెట్టారు. ఈ స్థాయికి ఎదగడానికి ముందు నెలకు రూ. 4 వేల జీతానికి నైట్ వాచ్‌మెన్‌గా పని చేశానని చెప్పుకొచ్చారు.
పూర్తి వివరాల్లోకెళితే.. కేరళలోని కాసర్‌గోడ్ జిల్లా పనాథూర్‌కు చెందిన రంజిత్ రామచంద్రన్ కడు పేదకుటుంబంలో జన్మించారు. తల్లి, తండ్రి సహా రంజిత్‌కు ఇద్దరు తమ్ములు ఉన్నారు. తండ్రి దర్జీ పని చేస్తుండగా.. తల్లి రోజువారీ కూలీకి వెళ్తుండేది. వారి చదువులకు అయ్యే ఖర్చులు చాలా భారంగా ఉండేది. ఈ నేపథ్యంలో రంజిత్ తాను చదువు మానేయాలని ఫిక్స్ అయ్యాడు. ఆ దిశగా అడుగులు కూడా వేశాడు. అయితే, ఒకానొక సందర్భంలో ఈ నిర్ణయంపై పునరాలోచన చేశాడు. చదువు మానేయడం కంటే.. ఏదైనా పని చేసుకుంటూ చదువుకుంటే బాగుంటుందని భావించాడు. మరేమాత్రం ఆలస్యం చేయలేదు. నెలకు రూ. 4వేల జీతానికి తన గ్రామ సమీపంలో ఉన్న బీఎస్ఎస్ఎల్ టెలిఫోన్ ఎక్స్చేంజ్‌లో నైట్ వాచ్‌మెన్‌గా ఉద్యోగంలోకి చేరారు.
అలా నైట్ వాచ్‌మెన్‌గా పని చేస్తూనే.. కాసర్‌గోడ్‌లోని కేరళ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యూయేషన్ పూర్తి చేశాడు. ఆ తరువాత ఐఐటీ మద్రాస్ నుంచి పీహెచ్‌డి పొందాడు. అయితే, తనకు ఇంగ్లీష్ రాకపోవడంతో.. పీహెచ్‌డీని వదిలేయాలని రంజిత్ ఫిక్స్ అయ్యాడు. ఇదే విషయాన్ని రంజిత్ తన గైడ్, ప్రొఫెసర్ సుభాష్‌కి చెప్పగా.. ఆయన రంజిత్‌ను వారించారు. పీహెచ్‌డీని మధ్యలో వదిలేయడం అనేది ఎంత తెలివి తక్కువ పనో వివరించి.. అతనిని మోటివేట్ చేశారు. దాంతో రంజిత్ తన ఆలోచనను విరమించుకున్నారు. కష్టపడి పీహెచ్‌డీని పూర్తి చేశాడు. అదే సమయంలో ఐఐఎంలో ప్రొఫెసర్ కావాలని కలలు కన్నాడు రంజిత్. చివరికి ఆ కలను సాకారం చేసుకున్నాడు. తాజాగా తన లక్ష సాధనలో తాను ఎదుర్కొన్న కష్టాలను రంజిత్ రామచంద్రన్.. తన ఫెస్‌బుక్ అకౌంట్‌లో పేర్కొంటూ తన ఇంటి ఫోటోను పోస్ట్ చేశాడు. ‘ప్రతీ ఒక్కరూ మంచి కలలు కనండి.. ఆ కలలను సాకారం చేసుకునేందుకు పోరాడండి’ అంటూ క్యాప్షన్ కూడా పెట్టాడు. ఈ పోస్ట్ ఇప్పుడు సో షల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Also read:
Horoscope Today: ఈరోజు ఈరాశివారు ఉద్యోగాలు, ఆస్తి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి.. ఈరోజు రాశిఫలాలు..
Papikondalu tourism : గోదావరి పాపికొండల పర్యటకం మళ్లీ మొదలు, 18 నెలల తర్వాత జలవనరుల శాఖ అనుమతి