ఎండకాలంలో మంచిదని పుచ్చకాయను ఎక్కువగా తింటున్నారా ? అయితే జాగ్రత్త.. ఈ సమస్యలు గురించి తెలుసుకోవాల్సిందే..

WaterMelon Side Effects: ఎండకాలంలో విరివిగా లభించే పండ్లలో పుచ్చకాయ ఒకటి. వేసవికాలంలో ఈ పండును ఎక్కువగా లభిస్తుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్‏గా

  • Rajitha Chanti
  • Publish Date - 9:33 am, Mon, 12 April 21
ఎండకాలంలో మంచిదని పుచ్చకాయను ఎక్కువగా తింటున్నారా ? అయితే జాగ్రత్త.. ఈ సమస్యలు గురించి తెలుసుకోవాల్సిందే..
Watermelon

WaterMelon Side Effects: ఎండకాలంలో విరివిగా లభించే పండ్లలో పుచ్చకాయ ఒకటి. వేసవికాలంలో ఈ పండును ఎక్కువగా లభిస్తుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్‏గా ఉంచడంలో సహాయపడుతుంది. ఇందులో సుమారు 92% నీటి శాతం ఉంటుంది. అందుకే ఎక్కువగా దీనిని తినడానికి ఇష్టపడుతుంటారు. అలాగే ఈ పుచ్చకాయ ధర మరి ఎక్కువగా ఉండకపోవడంతో… ప్రతి ఒక్కరూ ఈ పండును ఎక్కువగా తినేస్తుంటారు. తక్కువ ధరకు హెల్తీ ఫ్రూట్ వస్తుంది కాదా అని అవసరం లేకున్నా తినేస్తుంటారు. అయితే ఇది ఆరోగ్యానికి మంచి చేయడమే కాదండోయ్.. కొన్ని అనారోగ్య సమస్యలను కూడా తెచ్చిపెడుతుంది. మరీ అవెంటో తెలుసుకుందామా..

సహజంగానే పుచ్చకాయ స్వీట్ ఫ్రూట్. ఇందులో చక్కెర శాతం ఉంటుంది. అయితే డయాబెటిస్ రోగులు పుచ్చకాయను దూరంగా ఉండడమే బెటర్. ఎందుకంటే ఇది రక్తంలో షుగర్ లెవల్స్ పెంచడానికి సహయపడుతుంది. ఈ పుచ్చకాయ శరీరానికి మేలు చేసినా కానీ.. ఇది అదిక గ్లైసెమిక్ సూచిక (72) ఉంది. అందువల్ల డయాబెటిస్ రోగులు పుచ్చకాయ తినడానికి ముందు వైద్యులను సంప్రదించాలి.

పుచ్చకాయను పుచ్చకాయలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. అందుకే ఇద శరీరాన్ని అనేక విధాలుగా ఆరోగ్యంగా ఉంచడంలో సహయపడుతుంది. ఇది ఎలక్ట్రోలైట్ పనితీరును నిర్వహించడానికి సహయపడుతుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా.. ఎముకలు, కండరాలను బలంగా చేస్తుంది. అయితే అధిక పొటాషియం హార్ట్ బీట్, పల్స్ రేటు, గుండె సమస్యలను దారితీస్తుంది. అందుకే పుచ్చకాయను లిమిట్ ప్రకారం తీసుకోవాలి. ఇందులో పుష్కలంగా నీరు, డైటరీ ఫైబరీ ఉంటాయి. కానీ ఈ పుచ్చకాయ అధికంగా తినడం వలన కడుపులో సమస్యలు వస్తాయి. పుచ్చకాయలో సోర్బిటాల్ అనే చెక్కర శాతం ఉంటుంది. ఇది విరేచనాలు, యాసిడిటీ వంటి సమస్యలను కలిగిస్తుంది. ఇక రోజూ మద్యం సేవించే వారు పుచ్చకాయను తినకూడదు. పుచ్చకాయలో ఆల్కహాల్‌తో చర్య తీసుకోగల లైకోపీన్ అధిక మొత్తంలో ఉంటుంది. ఇది కాలేయంలో మంటను కలిగిస్తుంది. శరీరంలో నీటి పరిమాణం ఎక్కువగా ఉన్నప్పుడు ఓవర్ డీహైడ్రేషన్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇది సోడియం స్థాయిని తగ్గిస్తుంది. పుచ్చకాయను అధికంగా తీసుకోవడం శరీరంలో నీటి స్థాయి పెరుగుతుంది. శరీరం నుంచి అదనపు నీరు బయటకు రాకపోతే, అది రక్తంలో నీటి శాతం పెరుగుతుంది. ఇది వాపు, అలసట, బలహీనమైన మూత్రపిండాలను, పాదాల సమస్యలను కలిగిస్తుంది.

Also Read: మీ పిల్లలు చెక్కర తింటున్నారా ? వారి మెదడుపై ఈ ప్రభావం ఉంటుందట.. అధ్యాయనాల్లో షాకింగ్ విషయాలు..

షుగర్ వ్యాధి ఉన్నవారు బెండకాయ తింటే మంచిదేనా ? తాజా అధ్యాయనాలు ఏం చెబుతున్నాయంటే..

66 ఏళ్ల వయసులో కూడా ఏంటీ ఎనర్జీ. ఏంటీ గ్రేస్.. నెట్టింట వైరల్‌గా మారిన రేఖ డ్యాన్స్ వీడియో