AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జీహెచ్ఎంసీలో కరెంట్ షాక్‌లకు ఇంకెంత మంది బలి కావాలి.? మౌలాలిలో చిన్నారి నిషాంత్ మ‌ృతిపై ట్విట్టర్లో స్పందించిన మంత్రి కేటీఆర్

KTR reaction in Twitter on Nishanth Death : జీహెచ్ఎంసీలో కరెంట్ షాక్‌లకు ఇంకెంత మంది బలి కావాలి. లక్షలు, కోట్లు పెట్టి అపార్ట్‌మెంట్లు, బిల్డింగ్‌లు కట్టిస్తారు...

జీహెచ్ఎంసీలో కరెంట్ షాక్‌లకు ఇంకెంత మంది బలి కావాలి.? మౌలాలిలో చిన్నారి నిషాంత్ మ‌ృతిపై ట్విట్టర్లో స్పందించిన మంత్రి కేటీఆర్
Minister Ktr
Venkata Narayana
|

Updated on: Apr 12, 2021 | 10:18 AM

Share

KTR reaction in Twitter on Nishanth Death : జీహెచ్ఎంసీలో కరెంట్ షాక్‌లకు ఇంకెంత మంది బలి కావాలి. లక్షలు, కోట్లు పెట్టి అపార్ట్‌మెంట్లు, బిల్డింగ్‌లు కట్టిస్తారు. ఇంటి ముందు ట్రాన్స్‌పార్మర్‌కి కంచె వేయడంలో ఎందుకు నిర్లక్ష్యం. మౌలాలిలో చిన్నారి నిషాంత్ దుస్థితికి కారణం ఎవరు? ఇవే ప్రశ్నలు ఇప్పుడు మౌలాలి ప్రజల్ని వేధిస్తున్నాయి. ఇప్పటికే అనేక ఉదంతాల్లో హైదరాబాద్‌ వివిధ ప్రాంతాల్లో ట్రాన్స్‌ఫార్మర్ వైర్లు తగిలి అనేక మంది బలయ్యారు. తాజాగా మౌలాలిలో ఈస్ట్ మారుతి నగర్‌లో నిషాంత్ అనే బాలుడు ట్రాన్స్‌ఫార్మర్ విద్యుత్ వైర్లు తగిలి అక్కడే కుప్పకూలిపోయాడు. బాలుడి అరుపులు కేకలు విని బాలుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. నిశాంత్ ఛాతీ బాగం, మెడ బాగంతో పాటు వీపుపై తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. ఆ బాలుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

ఎనిమిదేళ్ల నిశాంత్ ఇంటి ముందు స్నేహితులతో కలిసి ఆడుకుంటున్న సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు అధికారుల నిర్లక్ష్యమే కారణంటూ కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ఫెన్సింగ్ ఏర్పాటు చేయకుండా టాన్స్ ఫార్మర్‌ను ఏర్పాటు చేసి బాలుడి ప్రమాదానికి కారణమయ్యారని ఆగ్రహించారు నిషాంత్ బంధువులు. ఈ వార్త ట్విటర్ ద్వారా మంత్రి కేటీఆర్ దృష్టికి వెళ్లడంతో ఆయన స్పందించారు. బాబుకి వైద్య ఖర్చు తాను భరిస్తానంటూ భరోసా ఇచ్చారాయన. మరోవైపు, బాలుడు వైద్య ఖర్చులు తానే భరిస్తానని మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ముందుకొచ్చారు. ఆదివారం సైనిక్ పూర్‌లోని ఓ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బాలుడ్ని పరామర్శించారు ఎమ్మెల్యే.

Read also : Police attack : పోలీసుల దాష్టీకం, వృత్తిధర్మం, మానవత్వం మరిచి కరోనా పేషంట్‌, కుటుంబ సభ్యులపై వికృత చేష్టలు