Beer: చలికాలమైనా తగ్గేదేలే.. బీర్లు తెగ తాగేస్తున్నారు.. తెలంగాణలో భారీగా పెరిగిన విక్రయాలు..

Beer Sales in Telangana: ఎండాకాలంలో చిల్డ్ బీర్లు తాగటం సాధారణమే.. కానీ.. చలికాలంలో చల్ల చల్లగా బీర్లు తాగటం మాత్రం ప్రస్తుతం హాట్ ట్రెండ్‌గా మారింది.

Beer: చలికాలమైనా తగ్గేదేలే.. బీర్లు తెగ తాగేస్తున్నారు.. తెలంగాణలో భారీగా పెరిగిన విక్రయాలు..
Beer
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 13, 2022 | 1:43 PM

Beer Sales in Telangana: ఎండాకాలంలో చిల్డ్ బీర్లు తాగటం సాధారణమే.. కానీ.. చలికాలంలో చల్ల చల్లగా బీర్లు తాగటం మాత్రం ప్రస్తుతం హాట్ ట్రెండ్‌గా మారింది. సాధారణంగా చల్లటి వాతావరణంలో లిక్కర్ సేవించడం సహజం.. కానీ ఈసారి చలికాలంలో చల్లగా చల్లగా బీర్లను తాగేస్తున్నారు మద్యం ప్రియులు. ఈ తీరు తెలంగాణలో ఎక్కువగా కన్పిస్తోంది. ఈ ఏడాది నవంబర్లో రాష్ట్రంలో బీర్ల అమ్మకాలు తొలిసారిగా మిగతా లిక్కర్ అమ్మకాల సంఖ్యను దాటేశాయి. ఈ నెలలో మొత్తం 52 లక్షల లిక్కర్ కేసులు అమ్ముడుపోగా, వీటిలో 27లక్షల బీర్ల కేసులు ఉన్నాయి. మిగతా 24 లక్షలు లిక్కర్ కేసులే.. ఒక్కో బీర్ కేసులో 24 బాటిల్స్ లేదా క్యాన్స్ ఉంటాయి. ఈ లెక్కన బీర్ ప్రియులు తాగేస్తున్న బీర్ల సంఖ్య దాదాపు 6.5కోట్ల వరకు ఉంటుంది. మరో మూడునెలలు ఇంకా చలికాలం మిగిలే వుంది బీర్ల అమ్మకాలు ఇంకా పెరిగే అవకాశముంది.

రాష్ట్రంలో బీర్లను సేవిస్తున్న వారిలో 95శాతం యువతే.. తెలంగాణలో ఏయేటికాయేడు బీర్ల అమ్మకాల్లో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో బీర్ల వినియోగంలో తెలంగాణ టాప్‌లో ఉంది. ఏడాదికి సగటున ఒక వ్యక్తి తలసరి బీర్ల సేవనం తెలంగాణలో 11 లీటర్లు ఉండగా, అది ఏపీలో 4.43 లీటర్లు, కర్నాటకలో 3.88 లీటర్లు, తమిళనాడులో 3.50లీటర్లు, కేరళలో 2.86లీటర్లుగా ఉంది.

2018-19లో 10వేల 9వందల75 కోట్ల రూపాయల విలువైన బీర్లు అమ్ముడుపోగా 2020-21లో ఈ అమ్మకాలు 14వేల,7వందల కోట్ల రూపాయలకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో 17వేల5వందలకోట్ల రూపాయలు విలువైన బీర్ల అమ్మకాలు జరుగగా ఈ ఏడాదిలో డిసెంబర్ రెండోవారం నాటికి అమ్ముడుపోయిన బీర్ల విలువ 12వేల 3వందల కోట్ల రూపాయలుగా ఉంది. రానున్న డిసెంబర్ 31, కొత్త సంవత్సర వేడుకలు, సంక్రాంతి పండుగల నేపథ్యంలో బీర్ల అమ్మకాలు సరికొత్త రికార్డును నమోదుచేసే అవకాశముంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..