Schools: చక్కగా చదువుకోవాల్సిన స్టూడెంట్స్ కూరగాయలు అమ్మారు.. అసలు విషయం తెలిస్తే శెభాష్ అనాల్సిందే..
విద్యార్థులకు మంచి విద్యాబుద్ధులు నేర్పించాల్సిన విద్యాలయాలు ప్రస్తుతం కొత్త రూపు సంతరించుకుంటున్నారు. మూస పద్ధతుల్లో కాకుండా విభిన్నమైన మార్గాలు వెదుక్కుంటున్నాయి. పాఠాలు అంటే టీచర్ సమక్షంలో...
విద్యార్థులకు మంచి విద్యాబుద్ధులు నేర్పించాల్సిన విద్యాలయాలు ప్రస్తుతం కొత్త రూపు సంతరించుకుంటున్నారు. మూస పద్ధతుల్లో కాకుండా విభిన్నమైన మార్గాలు వెదుక్కుంటున్నాయి. పాఠాలు అంటే టీచర్ సమక్షంలో స్టూడెంట్స్ కు వివరించడం అనే కాన్సెప్ట్ కు స్వస్తి పలుకుతున్నాయి పలు పాఠశాలలు. పాఠశాలల్లో నేర్చుకున్న విషయాలకు ప్రత్యక్ష అనుభవాలు కలిగిస్తున్నారు. ఇందు కోసం ఉపాధ్యాయులు కూడా సరికొత్త మెథడ్స్ ను ఎంచుకుంటున్నారు. థియరీ విధానంలోనే కాకుండా ప్రాక్టికల్ పరంగానూ విద్యార్థులకు నాలెడ్జ్ పెంచేందుకు కృషి చేస్తున్నారు. విద్యార్థులను కేవలం పుస్తకాలకే పరిమితం చేయకుండా.. విభిన్నంగా పాఠాలు బోధిస్తున్నారు. సైన్స్ వంటి విషయాలను అర్థవంతంగా వివరించడానికి లైబ్రరీలు ఉన్నాయి. అయితే.. సామాజిక అంశాలను వివరించడం కోసం.. విద్యార్థులకు సమాజంలోకి తీసుకెళ్లడం ఒక్కటే మార్గం. అయితే ఈ ఉపాధ్యాయులు మాత్రం అలా చేయలేదు. విద్యార్థులను సమాజానికి తీసుకెళ్లలేదు. సమాజాన్నే విద్యా్ర్థుల వద్దకు తీసుకువచ్చారు. ఇంతకూ సంగతేంటి అంటారా.. అయితే లేటెందుకు.. లెట్స్ గో…
వరంగల్ లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో స్కూల్ టీచర్స్ కూరగాయలు అమ్మించారు. రైతుబజార్లు – ఉపయోగాలు అనే అంశంపై అవగాహన కల్పించడం కోసం విద్యార్థులతో పాఠశాలలో రైతు బజారు ఏర్పాటు చేయించారు ఆ ఉపాధ్యాయులు. ఈ వెరైటీ కార్యక్రమం వరంగల్ నగరంలోని శంభునిపేట ప్రభుత్వ పాఠశాలలో జరిగింది. ఆరో తరగతి విద్యార్థులకు పాఠ్యాంశాల్లో ఉన్న రైతు బజార్ అనే అంశంపై వినూత్న రీతిలో అవగాహన కల్పించారు. విద్యార్థులకు నేరుగా రైతు బజార్ పై అవగాహన కల్పించేందుకు విద్యార్థులతోనే పాఠశాలలో రైతు బజార్ ఏర్పాటు చేశారు.
రైతులు పండించిన పంట ఉత్పత్తులు దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా రైతు బజార్లో అమ్ముకుంటే వచ్చే లాభాలపై విద్యార్థులు పాఠశాలలో విక్రయాలు చేసి అనుభూతి పొందారు. రైతు బజార్ పై విద్యార్థులకు అవగాహన కల్పించడం కోసమే ఇలా పాఠశాలలో విద్యార్థులతో కూరగాయల విక్రయం చేపట్టామని ఉపాధ్యాయులు తెలిపారు. దీంతో విద్యార్థులకు రైతు బజార్లకు ఇతర మార్కెట్లకు తేడా తెలిసిందని, వారికి పూర్తి అవగాహన కలుగుతుందని టీచర్స్ చెప్పారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..