AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prize Money: తొలి ట్రోఫీ గెలిచిన జమ్మూ కాశ్మీర్.. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా..?

Ranji Trophy Prize Money: ఈ మ్యాచ్ డ్రాగా ముగిసినా కూడా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కారణంగా జమ్మూ-కాశ్మీర్‌కే టైటిల్ దక్కింది. 1959-60లో తొలిసారి రంజీ ట్రోఫీలో పాల్గొన్న ఈ జట్టు 67 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. 1982-83లో సర్వీసెస్‌పై తొలి విజయం సాధించిన జమ్మూ-కాశ్మీర్, ఇప్పుడు తొలి టైటిల్‌ దక్కించుకుంది.

Prize Money: తొలి ట్రోఫీ గెలిచిన జమ్మూ కాశ్మీర్.. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా..?
Ranji Trophy Karnataka Vs Jammu And Kashmir
Venkata Chari
|

Updated on: Feb 28, 2026 | 3:37 PM

Share

Ranji Trophy Prize Money: రంజీ ట్రోఫీ 2025-26 ఫైనల్ మ్యాచ్ భారత దేశీయ క్రికెట్ చరిత్రలో ఒక చారిత్రాత్మక అధ్యాయంగా నిలిచింది. హుబ్లీ లోని KSCA క్రికెట్ గ్రౌండ్‌లో జమ్మూ-కాశ్మీర్, కర్ణాటక జట్లు తలపడ్డాయి. తొలిసారి రంజీ ఫైనల్‌కు చేరుకున్న జమ్మూ-కాశ్మీర్ జట్టు.. తొలి ట్రోఫీ గెలిచి చరిత్ర సృష్టించింది. తమ 67 ఏళ్ల చరిత్రలో మొదటిసారి ట్రోఫీని గెలుచుకుంది.

జమ్మూ-కాశ్మీర్ సంచలనం..

ఈ మ్యాచ్‌లో జమ్మూ-కాశ్మీర్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుని తొలి ఇన్నింగ్స్‌లో భారీగా 584 పరుగులు చేసింది. ప్రతిగా కర్ణాటక తొలి ఇన్నింగ్స్ 293 పరుగులకే పరిమితమైంది. మయాంక్ అగర్వాల్ అద్భుతంగా 160 పరుగులు చేసినప్పటికీ, మిగతా బ్యాట్స్‌మన్‌లు జమ్మూ-కాశ్మీర్ బౌలర్ల ముందు నిలవలేకపోయారు.

పాస్ట్ బౌలర్ ఆకిబ్ నబీ 5 వికెట్లు తీసి మ్యాచ్‌లో కీలక పాత్ర పోషించాడు. దీంతో జమ్మూ-కాశ్మీర్‌కు 291 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి జమ్మూ-కాశ్మీర్ రెండో ఇన్నింగ్స్‌లో కూడా ఆధిపత్యం కొనసాగించి మొత్తం ఆధిక్యాన్ని 477 పరుగులకు పెంచింది. ఇందులో కమ్రాన్ ఇక్బాల్ 94 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

ఈ మ్యాచ్ డ్రాగా ముగిసినా కూడా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కారణంగా జమ్మూ-కాశ్మీర్‌కే టైటిల్ దక్కింది. 1959-60లో తొలిసారి రంజీ ట్రోఫీలో పాల్గొన్న ఈ జట్టు 67 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. 1982-83లో సర్వీసెస్‌పై తొలి విజయం సాధించిన జమ్మూ-కాశ్మీర్, ఇప్పుడు తొలి టైటిల్‌ దక్కించుకుంది.

జమ్మూ కాశ్మీర్ కు భారీ నగదు బహుమతి..

రంజీ ట్రోఫీ 2025-26 విజేత జట్టుకు బీసీసీఐ తరఫున 5 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ అందనుంది. రన్నరప్ జట్టుకు కూడా 3 కోట్ల రూపాయల బహుమతి లభిస్తుంది. ఈ భారీ నగదు బహుమతి ఆటగాళ్ల కృషికి గౌరవం ఇచ్చే విధంగా ఉండటంతో పాటు దేశీయ క్రికెట్‌కు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఘరానా మొగుడు సినిమాకు చిరంజీవి రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారంటే..
ఘరానా మొగుడు సినిమాకు చిరంజీవి రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారంటే..
ఈ నక్షత్రాల్లో పుట్టినవారికి 40 ఏళ్లకే కోటీశ్వరులయ్యే అదృష్టం..!
ఈ నక్షత్రాల్లో పుట్టినవారికి 40 ఏళ్లకే కోటీశ్వరులయ్యే అదృష్టం..!
హోలికా ఎవరు...? కామ దహనం ఎందుకు చేస్తారో తెలుసా..? ఇది తెలిస్తేనే
హోలికా ఎవరు...? కామ దహనం ఎందుకు చేస్తారో తెలుసా..? ఇది తెలిస్తేనే
భారత్‌లోని ఈ ప్రాంతాల్లో గోల్డ్ ఫ్రీ.. ఫ్రీ.! ఎక్కడెక్కడంటే.?
భారత్‌లోని ఈ ప్రాంతాల్లో గోల్డ్ ఫ్రీ.. ఫ్రీ.! ఎక్కడెక్కడంటే.?
వీటిని పచ్చిగా తింటే మీ మెదడులోకి పురుగులు వెళ్లడం పక్కా..!
వీటిని పచ్చిగా తింటే మీ మెదడులోకి పురుగులు వెళ్లడం పక్కా..!
హోలీకి ప్రత్యేక రైళ్లు! పూర్తి టైమ్‌ టేబుల్‌ ఇదే!
హోలీకి ప్రత్యేక రైళ్లు! పూర్తి టైమ్‌ టేబుల్‌ ఇదే!
'డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు' వెబ్ సిరీస్ రివ్యూ..
'డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు' వెబ్ సిరీస్ రివ్యూ..
బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. నలుగురు దుర్మరణం..
బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. నలుగురు దుర్మరణం..
తొలి ట్రోఫీ గెలిచిన జమ్మూ కాశ్మీర్.. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా.?
తొలి ట్రోఫీ గెలిచిన జమ్మూ కాశ్మీర్.. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా.?
గుక్కపట్టి ఏడుస్తున్న పసిబిడ్డపై రామచిలుక మ్యాజిక్‌..! ఆ తర్వాత
గుక్కపట్టి ఏడుస్తున్న పసిబిడ్డపై రామచిలుక మ్యాజిక్‌..! ఆ తర్వాత