Pawan Kalyan: తెలంగాణలో రిజిస్ట్రేషన్‌ చేసినా ఏపీలో రూల్స్‌ ఫాలో కావాలి.. వైసీపీ నుంచి ఊహించని కౌంటర్

ఈ నెల 7న పవన్ కల్యాణ్‌ తన ఎన్నికల ప్రచారరథం వారాహి లుక్ రిలీజ్ చెయ్యడంతో మొదలైన మాటల యుద్ధం అంతా ఇంతా కాదు. ఆర్మీ వినియోగించే ఆలీవ్ గ్రీన్ కలర్‌ని పవన్ తన ప్రచారరథానికి ఎలా వినియోగిస్తారన్నది వైసీపీ నుంచి విమర్శలు వచ్చాయి.

Pawan Kalyan: తెలంగాణలో రిజిస్ట్రేషన్‌ చేసినా ఏపీలో రూల్స్‌ ఫాలో కావాలి.. వైసీపీ నుంచి ఊహించని కౌంటర్
Pawan Kalyan- Varahi Vehicle
Follow us

|

Updated on: Dec 12, 2022 | 8:15 PM

జనసేన అధినేత  పవన్‌ కల్యాణ్‌ ప్రచార వాహనం చుట్టూ రాజకీయం కంటిన్యూ అవుతోంది. ఆర్మీ వాడే ఆలివ్‌ గ్రీన్‌ కలర్‌ను ప్రచార వాహనానికి ఎలా వాడతారంటూ అభ్యంతరాలు వచ్చిన నేపథ్యంలో దానిపై ఒక క్లారిటీ ఇచ్చింది తెలంగాణ రవాణా శాఖ. అది ఎమరాల్డ్‌ గ్రీన్‌ కలర్‌ అని స్పష్టం చేస్తూ రిజిస్ట్రేషన్‌కు ఓకే చేసింది. టు ది హ్యాండ్స్‌ ట్రేడింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ పేరుతో RTA అధికారులు TS 13 EX 8384 నెంబర్‌తో రిజిస్ట్రేషన్‌ చేశారు. వాహనం కలర్‌ను ఎమరాల్డ్‌ గ్రీన్‌గా పేర్కొన్నారు.

దీనికీ ఆలీవ్‌ గ్రీన్‌కి కాస్త సారూప్యత ఉన్నా రెండూ వేరువేరు కావడంతో రిజిస్ట్రేషన్స్‌తో లైన్ క్లియర్ చేసింది ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్‌. ఆర్మీ గ్రీన్‌గా చెప్పే ఆలీవ్‌ గ్రీన్‌ బయట అందుబాటులో ఉండదని అధికారులు ధృవీకరించారు.  పైగా పొడవు, వెడల్పు, క్యార్‌వ్యాన్‌ విషయంలో మిగతా రూల్స్‌ను జనసేన ఫాలో అయినట్లు తేలడంతో నెంబర్ కూడా ఇచ్చేశారు. దీంతో కావాలని వారాహి వాహనం రిజిస్ట్రేషన్‌ను ఆపేశారంటూ జరిగిన ప్రచారానికి తెరపడింది.

తెలంగాణలో రిజిస్ట్రేషన్‌ చేసినా ఏపీలో రూల్స్‌ను కూడా ఫాలో కావాల్సి ఉంటుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి గుడివాడ అమర్‌నాధ్‌. పవన్ వాహనం నెంబర్లు కూడా చంద్రబాబుకు నచ్చినట్లే పెట్టుకున్నారని విమర్శించారు. మరోవైపు పవన్‌ ప్రతిదీ సినిమాలా ఆలోచించడం వల్లే ఇలాంటివన్నీ జరుగుతున్నాయన్నారు సజ్జల. తెలంగాణలో రిజిస్ట్రేషన్‌ అయిపోయిన వారాహి వెహికల్ ఏపీలో అడుగు పెడితే ఎలాంటి రియాక్షన్స్‌ వస్తాయో మరి.

మరిన్ని ఏపీ న్యూస్ కోసం

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో