YS Jagan: కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్.. 24 వేల కోట్ల పెట్టుబడులకు జగన్ సర్కార్ ఆమోదం..

కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఏపీ సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో పాటు మొత్తం 24 వేల కోట్ల పెట్టుబడులకు స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు (SIPB) ఆమోదం తెలిపింది.

YS Jagan: కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్.. 24 వేల కోట్ల పెట్టుబడులకు జగన్ సర్కార్ ఆమోదం..
AP CM YS Jagan
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 13, 2022 | 7:17 AM

కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఏపీ సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో పాటు మొత్తం 24 వేల కోట్ల పెట్టుబడులకు స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు (SIPB) ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల ద్వారా పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. సీఎం జగన్ అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా పలు భారీ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపిందీ బోర్డు. కడప జిల్లా సున్నపురాళ్లపల్లెలో JSW స్టీల్ లిమిటెడ్‌కు SIPB ఆమోదం తెలిపింది. రెండు విడతల్లో మొత్తంగా 8,800 కోట్ల పెట్టుబడితో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. మొదటి విడతలో 3 వేల 300 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. మొదటి దశలో ఏడాదికి మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తులు, రెండో విడతలో ఏడాదికి 2 మిలియన్ టన్నుల స్టీల్‌ ఉత్పత్తులే.. లక్ష్యంగా మొత్తం ఏడాదికి 3 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తులు టార్గెట్ గా ప్లాంట్ ప్రారంభించనుంది.

వీలైనంత త్వరగా ప్లాంట్ పనులు ప్రారంభమయ్యేలా చూడాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. రాయలసీమ ముఖచిత్రాన్ని మార్చే ప్రక్రియలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు గొప్ప ప్రయత్నమన్నారు ఏపీ సీఎం జగన్. ఈ ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాదిమందికి ఉపాధి లభిస్తుందన్నారు. స్టీల్ ప్లాంట్ ద్వారా వచ్చే అనుబంధ పరిశ్రమలతో రాయలసీమ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు సీఎం జగన్. దీంతో పాటు 1600 మెగావాట్ల పంప్డ్ హైడ్రో స్టోరేజీ పవర్ ప్రాజెక్టుకు SIPB గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ 6 వేల 330 కోట్ల పెట్టుబడితో పవర్ ప్రాజెక్ట్ స్థాపించనుంది.

దీని ద్వారా ప్రత్యక్షంగా 4 వేల మందికి ఉపాధి లభించనుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా పెదకోటలో వేయి మెగావాట్లు, అనకాపల్లి, విజయనగరం జిల్లాల పరిధిలో రైవాడ దగ్గర 600 మెగావాట్ల తో ప్రాజెక్ట్ ప్రారంభించనుంది. ఏడాదికి 4,196 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా అదాని కంపెనీ ప్లాంట్ నెలకొల్పనుంది. ఇవే కాకుండా.. మరో 8 వేల 855 కోట్ల హైడ్రో స్టోరేజీ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది SIPB.

ఇవి కూడా చదవండి

ఎర్రవరం, సోమశిల దగ్గర రెండు ప్రాజెక్టులు ఏర్పాటు చేయనుంది షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్. ఈ ప్లాంట్ ద్వారా 2100 మెగావాట్ల ఉత్పత్తి కానుంది. ఎర్రవరం దగ్గర 1200 మెగావాట్ల ప్రాజెక్టు, 900 మెగావాట్ల రెండో ప్రాజెక్ట్ సోమశిల దగ్గర ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది జులైలో ప్రారంభమై విడతల వారీగా ఐదేళ్లలో పూర్తి చేయాలన్నదొక టార్గెట్. ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రత్యక్షంగా 2100 మందికి ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తోంది ప్రభుత్వం.

మరిన్ని ఏపీ వార్తల కోసం..