Y. S. Sharmila: హైకోర్టుకు వైఎస్.షర్మిల.. పాదయాత్రకు అనుమతి ఇవ్వకపోవడంతో న్యాయస్థానానికి..

తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్ర తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. నర్సంపేటలో ఆమె పాదయాత్ర చేస్తున్న సమయంలో...

Y. S. Sharmila: హైకోర్టుకు వైఎస్.షర్మిల.. పాదయాత్రకు అనుమతి ఇవ్వకపోవడంతో న్యాయస్థానానికి..
Ys Sharmila
Follow us
Ganesh Mudavath

|

Updated on: Dec 13, 2022 | 1:50 PM

తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్ర తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. నర్సంపేటలో ఆమె పాదయాత్ర చేస్తున్న సమయంలో ఆమె కాన్వాయ్ పై దాడి చేయడం, అదే కారులో ప్రగతి భవన్ కు నిరసన తెలిపేందుకు వెళ్లడం, ఆమెను కారులో ఉండగానే అరెస్టు చేయడం వంటివి చకచకా జరిగిపోయాయి. అయితే షర్మిలకు బెయిల్ ఇచ్చిన కోర్టు.. పాదయాత్రకు కూడా అనుమతి ఇచ్చింది. అయితే శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారన్న కారణంతో పోలీసులు అనుమతి ఇవ్వడం లేదు. మరోసారి నర్సంపేట లాంటి ఘటనలు జరగకుండా ఉంటాయన్న గ్యారెంటీ ఏంటని ప్రశ్నిస్తున్నారు. దీంతో వైఎస్ షర్మిల ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. తన పాదయాత్రకు వెంటనే అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయినా స్పందన రాకపోవడంతో ఇవాళ (మంగళవారం) హైకోర్టును ఆశ్రయించాలని షర్మిల నిర్ణయించారు. మధ్యాహ్నం 2.30గంటలకు కోర్టుకు హాజరు కానున్నారు.

కాగా.. ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన సమయంలో షర్మిల ఆరోగ్యం దెబ్బతింది. దీంతో పోలీసులు ఆమె దీక్షను భగ్నం చేశారు. పోలీసులు భగ్నం చేశారు. అర్థరాత్రి ఒంటి గంట సమయంలో అరెస్ట్ చేసి ఆమె దీక్షను భగ్నం చేసి జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అపోలో ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో ప్రస్తుతం షర్మిలకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. దీంతో అర్ధరాత్రి లోటస్‌పాండ్ వద్ద హైటెన్షన్ నెలకొంది.

మరోవైపు.. తన పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంపై బీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల తీవ్రంగా ఫైర్ అయ్యారు. హై కోర్టు అనుమతి ఇచ్చినా.. కేసీఅర్ తన పాదయాత్ర ను టార్గెట్ చేశారని ఆరోపించారు. లోటస్ పాండ్ చుట్టూ అన్ని వైపులా బారికేడ్స్ పెట్టి, చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అకారణంగా కర్ఫ్యూ విధించారని విమర్శించారు. తమ కార్యకర్తలను బలవంతంగా పోలీస్ వ్యాన్ లోకి ఎక్కించి.. ఠాణాలో పెట్టి దారుణంగా కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం