Basara Fire Accident: పెళ్లి మండపంలో అగ్ని ప్రమాదం.. నాలుగు బైక్‌లతో సహా పలు వస్తువులు దగ్ధం.. పూర్తి వివరాలివే..
Basara Fire Accident:నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి కళ్యాణ మండపంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కల్యాణ మండపంలో వివాహ వేడక జరుగుతుండగా.. పెళ్లి అనంతరం స్నేహితులు, బంధువులు టపాసులు పేల్చారు. ఆ సమయంలో టపాసులు పేలి టెంట్ హౌస్‌కు..

Basara Vehicle Fire Accident
Basara Fire Accident:నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి కళ్యాణ మండపంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం కల్యాణ మండపంలో వివాహ వేడుక జరుగుతుండగా.. పెళ్లి అనంతరం స్నేహితులు, బంధువులు టపాసులు పేల్చారు. ఆ సమయంలో టపాసులు పేలి టెంట్ హౌస్‌కు నిప్పు అంటుకుంది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగగా.. బంధువులు, స్నేహితులు, వధూవరులను బయటకు తీసుకవచ్చారు. అదృష్టవశాత్తు ఈ అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టమూ జరగలేదు.
అయితే ఆ నాలుగు బైక్‌లు, అక్కడే ఉన్న కొన్ని కుర్చీలు, రెండు టెంట్లు పూర్తిగా దగ్ధం అయ్యాయి. సమాచారం అందుకుని రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ఫంక్షన్ హాల్లో టపాసులు పేల్చకుండా చూసుకోవాలని నిర్వాహకులకు సూచించారు.
ఇవి కూడా చదవండి

Astrology: ఆ రాశులవారితో జాగ్రత్త..! వారి మనస్తత్వం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

YS Jagan: విజయవాడ ‘మహా పూర్ణాహుతి’లో సీఎం జగన్.. యాగం తర్వాత వేలాది మంది భక్తులకు అన్నదానం..

New Parliament Inauguration: త్వరలోనే కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం..! ముహూర్తం కూడా ఫిక్స్.. ఎప్పుడంటే..?

Modakondamma Jatara: వైభవోపేతంగా మన్యం దేవత ఉత్సవాలు.. అమ్మవారి ఘటాలను పురవీధుల్లో ఊరేగిస్తూ..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..