Hyderabad: వన్ డే పోలీస్.. క్యాన్సర్‌తో బాధపడుతున్న బాలుడి కోరిక తీర్చిన బంజార హిల్స్ పోలీసులు
క్యాన్సర్‌తో బాధపడుతున్న ఏడేళ్ల బాలుడికి పోలీస్ కావాలనే కోరికను బంజార హిల్స్ పోలీసులు నెరవేర్చారు. గుంటూరుకు చెందిన మోహన్ సాయి అనే బాలుడు ఏడాది క్రితం క్యాన్సర్ బారీన పడ్డాడు. హైదరాబాదులోనే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఆ చిన్నారికి పోలీస్ కావాలని కోరిక ఉన్నదని ఆసుపత్రి సిబ్బంది తెలుసుకొని మేక్ ఏ విష్ ఫౌండేషన్ తెలియజేశారు. అనంతరం ఆ సిబ్బంది బంజర హిల్స్ పోలీసులను సంప్రదించారు. అక్కడ సిబ్బంది బాలుడిని సాదరంగా..
హైద్రాబాద్, డిసెంబర్ 15: క్యాన్సర్‌తో బాధపడుతున్న ఏడేళ్ల బాలుడికి పోలీస్ కావాలనే కోరికను బంజార హిల్స్ పోలీసులు నెరవేర్చారు. గుంటూరుకు చెందిన మోహన్ సాయి అనే బాలుడు ఏడాది క్రితం క్యాన్సర్ బారీన పడ్డాడు. హైదరాబాదులోనే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఆ చిన్నారికి పోలీస్ కావాలని కోరిక ఉన్నదని ఆసుపత్రి సిబ్బంది తెలుసుకొని మేక్ ఏ విష్ ఫౌండేషన్ తెలియజేశారు. అనంతరం ఆ సిబ్బంది బంజర హిల్స్ పోలీసులను సంప్రదించారు. అక్కడ సిబ్బంది బాలుడిని సాదరంగా ఆహ్వానించి పోలీస్ అధికారిగా సీట్లో కూర్చోబెట్టారు. బంజర హిల్స్ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్‌గా జాకీర్ హుస్సేన్ చిన్నారికి పోలీస్ వందనం చేసి చిన్నారి నుండి గౌరవ వందన స్వీకరించారు. అనంతరం పోలీస్ స్టేషన్ లో జరిగే పని విధానం గురించి ఆ చిన్నారి కి తెలియజేశారు.. అనంతరం బహుమతులు ఇవ్వడంతో ఆ చిన్నారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
గుంటూరుకు చెందిన మోహన్ సాయి గత కొద్ది రోజుల నుండి రెక్టమ్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. బ్రహ్మం, లక్ష్మి దంపతులకు మోహన్ సాయి రెండవ కుమారుడు. క్యాన్సర్ బారిన పడిన తన కొడుకుని చూసి ప్రతిరోజు ఆ బాధను దిగు మింగుతూ రోజులు గడుపుతున్నారు. గత కొద్ది రోజుల నుంచి బసవతారకం హాస్పిటల్ లోనే మోహన్ సాయి చికిత్సను తీసుకుంటున్నాడు. అయితే మోహన్ సాయి కి చిన్నప్పటినుండి పోలీసు అవ్వాలని కోరిక దృఢంగా ఉండేది. కానీ ఈ క్యాన్సర్ మహమ్మారి రావడంతో తన కోరిక కోరిక గాని మిగిలిపోతుంది అని అనుకున్నారు తల్లిదండ్రులు. అయితే తాను చికిత్స పొందుతున్న పసవతారకం హాస్పిటల్ లో ఉన్నటువంటి హాస్పిటల్స్ సిబ్బంది మోహన్ సాయి యొక్క కోరికను మేక్ ఎ డిష్ ఫౌండేషన్కు తెలియజేశారు.
ఆ విధంగా తాను కలలు కంటున్నా పోలీస్ కలను సార్ధకం చేశారు. దీంతో ఆ బాలుడికి పట్టరాని సంతోషం వేసింది. మోహన్ సాయి కుటుంబం అతి మధ్య తరగతి కుటుంబం చిన్నతనంలోనే తన కొడుకు క్యాన్సర్ బారిన పడడంతో మొక్కని దేవుడు లేడు తిరగని హాస్పిటల్ లేదు ఏదో ఒక రోజు అయినా తమ కొడుకు క్యాన్సర్ నుండి బయటపడతాడు అని చిన్న కోరికతో కాలాన్ని వెల్లడిస్తున్నారు. ఈ విధంగా తమ కొడుకు కలలు కన్న పోలీస్ ను సార్ధకం చేసినటువంటి హాస్పిటల్, మేక్ ఏ డిష్ సిబ్బందితోపాటు బంజర హిల్స్ పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. పోలీస్ యూనిఫామ్ వేసుకుని బంజర హిల్స్ పోలీస్ స్టేషన్ లోకి అడుగుపెట్టినటువంటి చిన్నారి మోహన్ సాయిని చూసి అందరూ సెల్యూట్ చేశారు. అంతేకాకుండా వచ్చినటువంటి కంప్లైంట్స్ ను చిన్నారి వద్దకు తీసుకువచ్చి ఆ ఫిర్యాదులను స్వీకరించాడు చిన్నారి మోహన్ సాయి. ఈ విధంగా పోలీస్ యూనిఫాం ధరించినందుకు ఎంతో సంతోషంగా ఉందని అంటున్నాడు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.




