Telangana: ‘బండి సంజయ్‌ యాత్రను ఆపేందుకు కేసీఆర్‌ మరో కుట్ర’.. విరుచుకుపడ్డ పాదయాత్ర ప్రముఖ్‌..

Telangana: బండి సంజయ్‌ పాదయాత్రకు ప్రజల నుంచి వస్తోన్న స్పందనను చూసి ఓర్వలేక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ యాత్రను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని పాదయాత్ర ప్రముఖ్‌ డాక్టర్‌ జి. మనోహర్‌ రెడ్డి విమర్శించారు...

Telangana: 'బండి సంజయ్‌ యాత్రను ఆపేందుకు కేసీఆర్‌ మరో కుట్ర'.. విరుచుకుపడ్డ పాదయాత్ర ప్రముఖ్‌..
Bandi Sanjay Padayatra
Follow us

|

Updated on: Sep 22, 2022 | 7:36 AM

Telangana: బండి సంజయ్‌ పాదయాత్రకు ప్రజల నుంచి వస్తోన్న స్పందనను చూసి ఓర్వలేక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ యాత్రను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని పాదయాత్ర ప్రముఖ్‌ డాక్టర్‌ జి. మనోహర్‌ రెడ్డి విమర్శించారు. పాదయాత్రను ఆపేందుకు కేసీఆర్‌ మరో కుట్రకు తెర తీశారని విమర్శించారు. నిబంధనల ఉల్లంఘన పేరుతో బాలా నగర్ ఏసీపీ నోటీసులు జారీ చేయడంపై మనోహర్‌ రెడ్డి ఓ రేంజ్‌లో ఫైర్‌ అయ్యారు. వారం రోజుల్లో సమాధానం ఇవ్వకుంటే చర్యలు తీసుకుంటామని బాలానగర్ ఏసీపీ పేరుతో నోటీసులు రావడం మనోహర్‌ రెడ్డి బుధవారం స్పందించారు.

ఈ విషయమై ఆయన మాట్లాడుతూ.. ‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపట్టిన ‘‘ప్రజా సంగ్రామ యాత్ర’’కు కనీవినీ ఎరగని రీతిలో విశేష స్పందన వస్తుండటంతో టీఆర్ఎస్ ప్రభుత్వం పాదయాత్రను అడ్డుకునేందుకు మరో కుట్రకు తెరతీసింది. తొలి మూడు పాదయాత్రలకు అసలు లిఖిత పూర్వకంగా అనుమతి ఇవ్వనేలేదు. మౌఖిక అనుమతి మాత్రమే ఇచ్చారు. కానీ పాదయాత్రకు విశేష స్పందన లభిస్తుండటం.. ఊరూవాడా సహా ఎక్కడికి వెళ్లినా బండి సంజయ్‌ను ఆదరిస్తూ తమ కష్టాలు సుఖాలు పంచుకోవడంతోపాటు తమ వాడిగా ప్రజలు భావిస్తుండటంతో టీఆర్ఎస్ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు’ అని విమర్శించారు.

ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా పాదయాత్రను ఆపే ప్రస్తే లేదని మనోహర్‌ రెడ్డి స్పష్టం చేశారు. త్వరలోనే 5వ విడత పాదయాత్ర షెడ్యూల్‌ను ప్రకటించబోతున్నట్లు తెలుపారు. పోలీసులు ఇచ్చిన నోటీసులకు సమాధానమిస్తామని, అవసరమైతే న్యాయపోరాటం చేసేందుకు వెనకాడమని తేల్చి చెప్పారు. ఇదిలా ఉంటే 4వ విడదత పాదయాత్ర గురువారం పూర్తి కాబోతున్న నేపథ్యంలో భారీ బహిరంగా సభకు ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో పోలీసులు నోటీసీలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..