AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: కారు గెలుచుకున్నారని నమ్మించి.. ఛార్జీలకు డబ్బులు పంపించాలని వేధించి.. చివరకు పోలీసుల చేతికి చిక్కి..

ప్రస్తుతం సోషల్ మీడియా (Social Media) ద్వారా ప్రపంచమంతా అరచేతిలోకి వచ్చేసింది. చేతిలో ఫోన్.. ఫోన్ లో డేటా ఉంటే చాలు.. అందులోనే గంటలకు గంటలు గడిపేస్తున్నారు. ఇక షాపింగ్ విషయానికి వస్తే బయట దుకాణాలకు..

Hyderabad: కారు గెలుచుకున్నారని నమ్మించి.. ఛార్జీలకు డబ్బులు పంపించాలని వేధించి.. చివరకు పోలీసుల చేతికి చిక్కి..
Mahesh Bhagawat
Ganesh Mudavath
|

Updated on: Sep 21, 2022 | 7:23 PM

Share

ప్రస్తుతం సోషల్ మీడియా (Social Media) ద్వారా ప్రపంచమంతా అరచేతిలోకి వచ్చేసింది. చేతిలో ఫోన్.. ఫోన్ లో డేటా ఉంటే చాలు.. అందులోనే గంటలకు గంటలు గడిపేస్తున్నారు. ఇక షాపింగ్ విషయానికి వస్తే బయట దుకాణాలకు వెళ్లి కొనుగోలు చేయడాన్ని పూర్తిగా మానేశాం. వీటినే ఆసరాగా చేసుకుంటున్న నేరగాళ్లు కొత్తకొత్త దారులు వెతుక్కుంటున్నారు. మోసాలకు పాల్పడుతూ ఉన్న డబ్బునంతా కొట్టేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఇలాంటి ఘటనే జరిగింది. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు 9 మందిని అరెస్టు చేశారు. ఫేక్ కాల్ (Fake Call) సెంటర్ తో మోసాలకు పాల్పడుతున్న సైబర్ గ్యాంగ్ నేరగాళ్లను రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. 9 మంది అరెస్టు చేశారు. ఈ మేరకు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ వివరాలు వెల్లడించారు. బిహార్, వెస్ట్ బెంగాల్ కేంద్రంగా తెలుగు వాళ్లతో కాల్ సెంటర్ నిర్వహిస్తున్న ముఠాను అరెస్టు చేసినట్లు తెలిపారు. కోల్ కతా కేంద్రంగా ఫేక్ కాల్ సెంటర్ నిర్వహిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు.. ప్రధాన నిందితుడు ఉత్తమ్ కుమార్ తో పాటు మరో 8 మంది ని అరెస్టు చేశారు.

ఉత్తమ్ కుమార్ రమేష్ తో కలిసి 2017 నుంచి తెలుగు కాల్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. ఈ ముఠా ఈ కామర్స్ వెబ్ సైట్స్ లో వస్తువులు కొనుగోలు చేస్తున్న వారిని టార్గెట్ చేసి మోసాలు చేస్తోంది. ప్రముఖ ఆన్ లైన్ కామర్స్ సైట్ పేరు చెప్పి, మీరు అందులో షాపింగ్ చేశారని, స్క్రాచ్ కార్డ్స్ లో లక్కీ డ్రా లో వచ్చిందని నమ్మిస్తారు. లక్కీ డ్రాలో కారు గెలుచుకున్నారని కవ్విస్తారు. వాటిని మీ వద్దకు చేర్చాలంటే ఛార్జీలు అవుతాయని, అందువల్ల కొంత నగదును తమకు పంపించాలని కోరతారు. వీరి మాటలు నమ్మి డబ్బులు పంపించిన తర్వాత పెట్టేబేడా సర్దుకుని ఉడాయిస్తారు. తర్వాత వీరికి ఎంతగా కాల్ చేసినా కనెక్ట్ అవదు.

ఇబ్రహీంపట్నానికి చెందిన కిషోర్ నాప్టోల్ లో షాపింగ్ చేశాడు. అతనికి స్క్రాచ్ కార్డ్ లో కార్ వచ్చిందని గుర్తు తెలియని వ్యక్తులు కాల్ చేశారు. వారి మాటలు నమ్మిన కిషోర్ కొంత నగదు పంపించాడు. తీరా మోసపోయానని గ్రహించి, పోలీసులకు కంప్లైంట్ చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేస్తున్న సమయంలో వారికి షాకింగ్ విషయాలు తెలిశాయి. దేశ వ్యాప్తంగా వారిపై 116 కేసులు ఉన్నట్లు గుర్తించారు. వాటిలో తెలంగాణలోనే 34 కేసులు ఉన్నట్లు నిర్ధరించారు. నిందితుల నుంచి నగదు, ఒక కారు, 39 మొబైల్ ఫోన్స్,5 లాప్ టాప్స్, వైఫై రూటర్లు 2, డెబిట్ కార్డ్స్ 16, నాప్తోల్ లెటర్ స్కాచ్ కార్డ్స్ 121 స్వాధీనం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..