Hyderabad: తన కారుకు ఫైన్ వేసినందుకు రెచ్చిపోయిన మహిళ.. నడిరోడ్డుపై పోలీసులకే వార్నింగ్

హైదరాబాద్ సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ హల్ చల్ చేసింది. తన కారుకు ఫైన్ వేసినందుకు పోలీసులతో నడిరోడ్డుపై వాగ్వాదానికి దిగింది.

Hyderabad: తన కారుకు ఫైన్ వేసినందుకు రెచ్చిపోయిన మహిళ.. నడిరోడ్డుపై పోలీసులకే వార్నింగ్
Angry Woman Vs Traffic Police
Follow us

|

Updated on: Sep 21, 2022 | 5:41 PM

Telangana: హైదరాబాద్‌ సుల్తాన్‌బజార్‌(Sultan Bazar) ప్రాంతంలో ఓ మహిళ హల్‌చల్‌ చేసింది. ట్రాఫిక్‌ పోలీసులపై విరుచుకుపడింది. వాకీటాకీని లాక్కుని నానాహంగామా చేసింది. సుల్తాన్‌బజార్‌ బ్యాంక్‌ స్ట్రీట్‌లో ఓ మహిళ నో పార్కింగ్‌ జోన్‌లో కారు పార్క్‌ చేసింది. ఇది గమనించిన ట్రాఫిక్‌ పోలీసులు.. నిబంధనల ప్రకారం వీల్‌ లాక్‌ చేసి వెళ్లారు. కాసేపటికి కారు వీల్‌కు లాక్‌ వేసి ఉండడాన్ని చూసిన మహిళ మహంకాళిగా మారింది. పోలీసులన్న భయం.. గౌరవం మరిచింది. నా కారునే లాక్‌ చేస్తారా? నాకే చలాన్‌ విధిస్తారా అంటూ ట్రాఫిక్‌ పోలీసులతో వాగ్వాదానికి దిగింది. మీకెంత ధైర్యం అంటూ దాడికి యత్నించింది. ఆగ్రహంతో పోలీసుల నుంచి వాకీటాకీని లాక్కుని నేలకేసి కొట్టేందుకు ప్రయత్నించింది. కారు ఎవరిదనుకుని తీసుకెళ్తున్నారంటూ హడావుడి చేసింది. మహిళ హల్‌చల్‌ను చూసిన స్థానికులు అవాక్కవుతున్నారు. ఈ తతంగాన్నంతా కామ్‌గా భరించిన ట్రాఫిక్‌ పోలీసులు.. మహిళపై లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుల్తాన్ బజార్ లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులు మహిళపై కేసు నమోదు చేసి కారును సీజ్‌ చేశారు. ట్రాఫిక్‌ పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన మహిళను దివ్యగా గుర్తించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..