Bandi Sanjay: ప్రజల దృష్టి మళ్లించేందుకే ప్రధానిపై సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలు.. బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్

Bandi Sanjay on CM KCR: ముఖ్యమంత్రి కేసీఆర్‌ జిల్లాల టూర్‌తో తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. బీజేపీపై పవర్‌ పంచ్‌లు పేలుస్తూ.. గులాబీ బాస్‌ తీవ్ర స్థాయిలో మండిపడుతన్నారు. ఈ క్రమంలో

Bandi Sanjay: ప్రజల దృష్టి మళ్లించేందుకే ప్రధానిపై సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలు.. బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్
Bandi Sanjay
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 12, 2022 | 11:47 PM

Bandi Sanjay on CM KCR: ముఖ్యమంత్రి కేసీఆర్‌ జిల్లాల టూర్‌తో తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. బీజేపీపై పవర్‌ పంచ్‌లు పేలుస్తూ.. గులాబీ బాస్‌ తీవ్ర స్థాయిలో మండిపడుతన్నారు. ఈ క్రమంలో శనివారం భువనగిరిలో జరిగిన సభలో సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో జరిగే అవినీతి బాగోతాల చిట్టా తనకు అందిందని కీలక కామెంట్స్‌ చేశారు సీఎం కేసీఆర్. దేశమంతా తిరిగి అన్ని భాషల్లో వీరి బాగోతాలు చెబుతానని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (CM KCR) స్పష్టం చేశారు. మోదీ పాలనలో దేశాన్ని ఆకలి రాజ్యంగా మార్చారని ఫైర్‌ అయ్యారు. కరోనా సమయంలో ప్రధాని మోదీ (PM Modi) తెలివితక్కువ లాక్‌డౌన్‌ నిర్ణయం వల్ల కోట్లాది మంది ఇబ్బందులు పడ్డారని వివరించారు కేసీఆర్. మమతా బెనర్జీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ఠాక్రే తనతో మాట్లాడారని, కేంద్రంపై అందరం కలిసి పోరాటం చేయాలని చెప్పినట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు.

ఈ క్రమంలో ప్రధాని మోదీపై సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యల్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ (Bandi Sanjay) ఖండించారు. కేసీఆర్ అవినీతిపై విచారణ జరగబోతోందని.. తన పని ఖతమైందని గ్రహించి తెలంగాణ సెంటిమెంట్​తో రాజకీయ లబ్ది పొందేందుకు కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. సీఎం సెంటిమెంట్‌ను రగిలించే కుట్రలు చేస్తున్నారని.. రాజ్యాంగంపై సీఎం వ్యాఖ్యలను ప్రజలు అసహ్యించుకుంటున్నారంటూ బండి పేర్కొన్నారు. ప్రజల దృష్టి మళ్లించేందుకు కేసీఆర్‌ తాపత్రాయ పడుతున్నార్నారు. నాడు లాక్‌డౌన్‌పై ప్రధాని నిర్ణయాన్ని ప్రశంసించిన సీఎం.. ఇప్పుడు ఆ నిర్ణయం తప్పంటూ విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఢిల్లీలో మోదీకి దండాలు పెట్టి.. ఇక్కడ తిట్టడం కేసీఆర్‌కు అలవాటైపోయిందంటూ బండి ఎద్దేవా చేశారు.

వ్యవసాయ బోర్లుకు మీటర్లు పెట్టాలని కేంద్రం ఏనాడైనా చెప్పిందా.. అంటూ బండి ప్రశ్నించారు. మీటర్లు పెట్టాలని కేంద్రం చెప్పినట్లు నిరూపిస్తే తాను క్షమాపణలు చెబుతానని తెలిపారు. కేసీఆర్‌ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీకి అనుకూలంగా మాట్లాడటంపై బండి స్పందించారు. దీంతో కాంగ్రెస్‌- టీఆర్ఎస్ చీకటి ఒప్పందం బయటపడిందంటూ సంజయ్‌ వ్యాఖ్యానించారు.

Also Read:

CM KCR Speech Updates: కేంద్రం అవినీతి చిట్టా అందింది.. పీఎం మోదీపై సంచలన కామెంట్స్ చేసిన సీఎం కేసీఆర్..

Andhra Pradesh: భేటీ అజెండాలో బిగ్ ట్విస్ట్.. ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని తొలగించిన కేంద్ర హోంశాఖ

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!