AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bandi Sanjay: నన్ను రాష్ట్ర అధ్యక్షుడిని చేయడానికి కారణం ఇదే.. కరీంనగర్ సభలో బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..

కరీంనగర్ అడ్డా.. బీజేపీ గడ్డా..! అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. హిందూ ధర్మ రక్షణ కోసం పనిచేస్తానన్నారు. ధర్మం కోసం యుద్ధం చేస్తానన్నారు.

Bandi Sanjay: నన్ను రాష్ట్ర అధ్యక్షుడిని చేయడానికి కారణం ఇదే.. కరీంనగర్ సభలో బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..
Bandi Sanjay
Sanjay Kasula
|

Updated on: Dec 15, 2022 | 6:38 PM

Share

ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు ఒక్కటయ్యారని విమర్శించారు బండి సంజయ్. అధికారం కోసం సెంటిమెంట్‌ను రగిల్చే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు. ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభలో ఆయన మాట్లాడుతూ, కరీంనగర్ అడ్డా.. బీజేపీ గడ్డా..! అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. కరీంనగర్ లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ… హిందూ ధర్మ రక్షణ కోసం పనిచేస్తానన్నారు. ధర్మం కోసం యుద్ధం చేస్తానన్నారు. బీజేపీ అధినాయకత్వం నన్ను రాష్ట్ర అధ్యక్షుడిని చేయడానికి కారణం కార్యకర్తలే. కరీంనగర్‌లో కొట్లాడినట్లే రాష్ట్రమంతా కొట్లాడమని మోదీ, అమిత్‌షా, నడ్డా చెప్పారు. తెలంగాణ కాషాయ జెండా రెపరెపలాడాలని చెప్పారు.

తనను ఎన్నో అవమానాలకు గురిచేశారని కరీంనగర్‌లో సభలో కన్నీళ్లు పెట్టుకున్నారు. నాకు గెలుపు ముఖ్యం కాదు.. గెలుపు కోసం పనిచేస్తా. నాకు ప్రజలే ముఖ్యం.. పదవులు కాదు. తనకు డిపాజిట్ రాదని హేళన చేశారని, కరీంనగర్ నుంచి లక్ష ఓట్ల మెజార్టీతో గెలిచానన్నారు. రాక్షస పాలన, కుటుంబ పాలన అంతమొందిస్తామన్నారు. కమలం జెండా వికసించేలా పనిచేయాలని మోడీ చెప్పారన్నారు. కరీంనగర్ గడ్డ మీద గాండ్రిస్తే కొందరికి వణుకు పుట్టాలన్నారు. అధికారంలోకి వచ్చాక తెలంగాణకు ఏం చేశారో కేసీఆర్‌ చెప్పడం లేదు. మోదీని తిట్టడమే కేసీఆర్‌ పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు.

రాక్షసపాలన, కుటుంబ పాలన అంతమొందిస్తా.. కమలం జెండా వికసించేలా పని చేయాలని ప్రధాని మోదీ చెప్పారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. బీఆర్ఎస్ పేరుతో తెలంగాణను తొలగించారని.. దీంతో తెలంగాణకు పీడ విరగడైందన్నారు. పార్టీలోంచి ఉద్యమకారులను బయటికి పంపారు.. బీఆర్ఎస్ పేరుతో దేశాన్ని దోచుకునేందుకు బయల్దేరారని విమర్శించారు. రాష్ట్రంలో సాండ్, లిక్కర్‌, గ్రానైట్, డ్రగ్స్‌ దందా చేశారని అన్నారు.

మీ ఆశీర్వాదంతో..

కరీంనగర్ మట్టికి మొక్కి, మీ ఆశీర్వాదంతో కేసీఆర్ ప్రభుత్వాన్ని బొందపెట్టాలని.. ఈ ముగింపు సభను పెట్టుకున్నామని ప్రజలనుద్దేశించి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్‌లో బీజేపీ 5వ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ సందర్భంగా ఈటల మాట్లాడారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం