Telangana: పట్టుబడ్డ పందెం కోళ్లు వేలం.. ఎంత ధర పలికాయో తెలిస్తే షాకే
హైదరాబాద్ నగరంలో సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫార్మ్ హౌస్ కోడి పందాల కేసులో ఓ ఆసక్తికర మలుపు వచ్చింది. పందెం కోళ్లను విచారణ అనంతరం వేలం పాటలో ఉంచడం విశేషంగా మారింది. రాజేంద్రనగర్ ఉప్పర్‌పల్లి మెట్రోపాలిటన్ కోర్టు ఆదేశాల ప్రకారం, ఈ వేలం పాట జడ్జ్ సమక్షంలోనే కొనసాగుతుంది.

హైదరాబాద్ నగరంలో సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫార్మ్ హౌస్ కోడి పందాల కేసులో ఓ ఆసక్తికర మలుపు వచ్చింది. పందెం కోళ్లను విచారణ అనంతరం వేలం పాటలో ఉంచడం విశేషంగా మారింది. రాజేంద్రనగర్ ఉప్పర్‌పల్లి మెట్రోపాలిటన్ కోర్టు ఆదేశాల ప్రకారం, ఈ వేలం పాట జడ్జ్ సమక్షంలోనే కొనసాగుతుంది.
మొయినాబాద్ ఫార్మ్ హౌస్‌లో జరిగిన ఈ ఘటనలో అధికారులు దాదాపు 84 పందెం కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఎలాంటి ఆధారాలు లేకుండా నిల్వ ఉంచడం కుదరదని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాటిని వేలం వేయాలని కోర్టు నిర్ణయించింది. దీంతో నిన్న మధ్యాహ్నం నుంచి వేలం పాట ప్రక్రియ వేగంగా ప్రారంభమైంది.ఈ వేలం పాటకు ప్రజల నుంచి విశేషమైన స్పందన లభించింది. కోళ్ల కోసం ఎంతోమంది ఆసక్తిని ప్రదర్శించారు. వేలం పాటలో పాల్గొన్న వారిలో కొందరు ఫార్మ్ హౌస్ యజమానులు, మరికొందరు వ్యాపారవేత్తలు, స్థానిక రైతులు ఉన్నారు.ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మొన్న కోడి పందాల్లో పట్టుబడ్డ కొంత మంది పందెం రాయుళ్లు కూడా ఈ వేలం పాటలో పాల్గొన్నారు. మళ్లీ తమ కోళ్లను పొందేందుకు వీరు భారీ మొత్తంలో బిడ్డింగ్ పెట్టడం గమనార్హం.
ఇదే సమయంలో వేలం పాటను ఉపయోగించుకుని పందెం రాయుళ్లు మళ్లీ తమ పందెం కోళ్లను సొంతం చేసుకుంటున్నారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు నిశితంగా గమనిస్తూ, వారి సమాచారాన్ని నమోదు చేస్తున్నారు. కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఈ వేలం పాట న్యాయపరమైన విధానంలో జరుగుతోంది. ఫార్మ్ హౌస్ యజమానులు కోర్టును ఆశ్రయించి కోళ్లను తిరిగి తమకు అప్పగించాలని కోరినప్పటికీ కోర్టు వారి అభ్యర్థనను తిరస్కరించింది. స్వాధీనం చేసుకున్న కోళ్లను వేలం వేయడమే సరైన నిర్ణయమని స్పష్టం చేసింది. ఒక్కొక్క కోడికి 50 వేల నుంచి వేలం పాట ప్రారంభమైంది. కోడిని దక్కించుకునేందుకు పోటీ తీవ్రతరంగా ఉంది. ఒక్కో కోడికి వేలం పాట ధర 50వేల దగ్గర స్టార్ట్ అయితే.. ఇప్పటికే పదికోళ్లను ఒక్కోదాన్ని రెండున్నర లక్షలకు దక్కించుకున్నారు కొంతమంది పందెం ప్రియులు. మరి టోటల్‌గా టాప్ ధర ఎంత పలుకుతుందో వేచి చూడాలి.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి