AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తాను మరణిస్తూ ఐదుగురికి కొత్త ఊపిరినిచ్చాడు.. కిషోర్ గారు అమరుడు..

కన్ను తెరిస్తే జననం.. కన్ను మూస్తే మరణం.. ఈ రెండింటి మధ్యే మనిషి జీవితం.. మరణశయ్యపై ఉంటూ మరో నలుగురికి అవయవాలను ప్రసాదించడం ఒక సేవాయజ్ఞం. మరణానంతరం కూడా జీవిస్తున్నాడు కొత్తగూడెం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి. అవయవ దానంతో ఐదుగురి జీవితాలలో వెలుగులు నింపేందుకు పెద్ద మనసుతో ముందుకు వచ్చిన ఆ కుటుంబానికి సెల్యూట్ చేస్తోంది యావత్‌ సమాజం. అవయవ దానం పై అవగాహన పెరగాలనీ.. అపోహలు, మూఢనమ్మకాలు వీడాలని కోరుతున్నారు వైద్యులు.

Telangana: తాను మరణిస్తూ ఐదుగురికి కొత్త ఊపిరినిచ్చాడు.. కిషోర్ గారు అమరుడు..
Kishore
N Narayana Rao
| Edited By: |

Updated on: Feb 17, 2025 | 5:25 PM

Share

తాను చనిపోతూ ఐదుగురుకి పునర్జన్మని ఇచ్చాడు ఓ కార్మికుడు.. తీవ్ర అనారోగ్యం పాలు కావడంతో  బ్రెయిన్ డెడ్ అయ్యింది. దీంతో అతని అవయవాలను కుటుంబ సభ్యులు దానం చేశారు. వివరాల్లోకి వెళ్తే… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రుద్రంపూర్‌కు చెందిన కిషోర్ (56)అనే కార్మికుడు ..సింగరేణిలో బొగ్గు లోడింగ్ కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఇతనికి పెళ్లి కాలేదు.. కుటుంబ సభ్యులతో నివసిస్తూ..ప్రతి రోజూ సింగరేణిలో విధులకు హాజరు అవుతున్నారు. తరచూ అనారోగ్యం పాలవుతుంటే..స్థానిక ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈ నెల 8న కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు తరలించారు. ప్రవేట్ ఆస్పత్రిలో మెరుగైన వైద్యం అందించినా కోలుకోలేదు. ఈ నెల 15 న బ్రెయిన్ డెడ్ అయినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు.

డాక్టర్ల సూచన మేరకు కిషోర్ కుటుంబ సభ్యులు అతని అవయవాలను దానం చేసేందుకు అంగీకరించడంతో ఒకరికి కాలేయం, ఇద్దరికి మూత్రపిండాలు, మరో ఇద్దరికీ కార్నియాలను అమర్చారు..మొత్తం ఐదుగురికి అవయవాలను దానం చేసి వారికి కొత్త ఊపిరి పోశారు. అనంతరం కిషోర్ మృతదేహాన్ని స్వగ్రామం కొత్తగూడెం తీసుకురావడంతో గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. పుట్టెడు దు:ఖంలో ఉండి కూడా ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకున్న కుటుంబ సభ్యులను పలువురు అభినందించారు. తాను చనిపోతూ కిషోర్ ఐదుగురికి కొత్త జీవితాన్ని ప్రసాదించాడు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి 

డబ్బులు లెక్కపెడుతుండగా నోట్‌పై కనిపించిన ఏవో పిచ్చిగీతలు..
డబ్బులు లెక్కపెడుతుండగా నోట్‌పై కనిపించిన ఏవో పిచ్చిగీతలు..
బాడీ షేమింగ్‌ చేశారు.. పెళ్లి చేసుకోవాలంటే ఆ కండిషన్ పెట్టారు
బాడీ షేమింగ్‌ చేశారు.. పెళ్లి చేసుకోవాలంటే ఆ కండిషన్ పెట్టారు
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?