AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒరేయ్ పాపాత్ముడా.! నీకేం పోయేకాలంరా.. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని ఎంత పని చేశావ్

మద్యానికి బానిసైన కొందరు.. తాగిన మైకంలో ఏం చేస్తున్నారో వారికి అర్ధం అవ్వడం లేదు. తాగడానికి డబ్బులు కావాలి వాటి కోసం ఏమి చేయడానికి అయిన వెనుకడడం లేదు. అవసరమైతే ఎదుటివారి ప్రాణాలు తీయడానికి కూడా బరి తెగిస్తున్నారు. ఆ వివరాలు ఇలా..

ఒరేయ్ పాపాత్ముడా.! నీకేం పోయేకాలంరా.. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని ఎంత పని చేశావ్
Representative Image
P Shivteja
| Edited By: |

Updated on: Feb 17, 2025 | 6:29 PM

Share

మద్యానికి బానిసైన కొందరు.. తాగిన మైకంలో ఏం చేస్తున్నారో వారికి అర్ధం అవ్వడం లేదు. తాగడానికి డబ్బులు కావాలి వాటి కోసం ఏమి చేయడానికి అయిన వెనుకడడం లేదు. అవసరమైతే ఎదుటివారి ప్రాణాలు తీయడానికి కూడా బరి తెగిస్తున్నారు. ఇలాంటి ఘటనే ఒకటి మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. తాగుడికి ఫుల్లుగా బానిసైన ఓ వ్యక్తి మద్యానికి డబ్బులు ఇవ్వడం లేదని.. కట్టుకున్న భార్యనే హతమార్చాడు.

వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా తుప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని పోతురాజుపల్లిలో దారుణం చోటు చేసుకుంది. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని కోపంతో భార్యను కర్రతో కొట్టి హతమార్చిన ఘటన స్థానికంగా జరిగింది. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆదివాసి అశోక్ అతని భార్య శివకాలి ఇద్దరు కూలీ పనులు చేసుకుంటూ గత కొద్దిరోజులుగా ఇక్కడే జీవనం కొనసాగిస్తున్నారు. అతిగా మద్యానికి బానిసైన అశోక్ నిత్యం మద్యానికి డబ్బులు ఇవ్వాలని భార్యను వేధించేవాడు. ఎప్పటిలాగే నిన్న రాత్రి డబ్బులు విషయంలో భార్యాభర్తలకు గొడవ జరిగింది. ఇక మద్యం మత్తులో ఉన్న భర్త అశోక్, భార్యపై కట్టెతో తల, చేతులు కాళ్లపై ఇష్టం వచ్చిన రీతిలో దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావం జరిగి అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న తుప్రాన్ సీఐ రంగాకృష్ణ సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి

వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..