Watch Video: పట్టపగలే హత్యాయత్నం.. వైన్‌షాప్‌లోకి దూరి ప్రాణాలుకాపాడుకున్న ముగ్గురు.. అసలు ఏం జరిగిందంటే?
సూర్యాపేట జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పట్టపగలే కొందరు దుండగులు బైక్ వెళ్తున్న ముగ్గురిపై హత్యాయత్నం చేశారు. అయితే దుండగులనుంచి తప్పించుకోవడానికి బైక్‌పై వస్తున్న ముగ్గురు ఒక వైన్ షాప్‌లోకి పరుగుతు తీశారు. వెంటనే వైన్ షాక్‌లోంచి జనాలు బయటకు రావడంతో దుండగులు వాళ్లను వదిలేసి పారిపోయారు. దీంతో ఆ ముగ్గురు తమ ప్రాణాలను కాపాడుకోగలిగారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్‌గా మారింది.

బైక్‌పై వెళ్తున్న ముగ్గురు (ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు) వ్యక్తులను చంపేందుకు కొందరు దుండగులు కార్‌తో వెంబడించగా.. వారు ఒక వైన్ షాపులోకి వెళ్లి తమ ప్రాణాలను కాపాడుకున్న ఘటన సూర్యాపేట జిల్లాలో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చివ్వెంల మండలం అక్కలదేవిగూడెంకు చెందిన దండుగల లక్ష్మయ్యకు సూర్యాపేటకు చెందిన గోపి అనే వ్యక్తి రూ.3 వేలు ఇవ్వాల్సి ఉంది. అయితే కొన్నాళ్లుగా అతను డబ్బులు ఇవ్వడం లేదని.. ఇటీవలే లక్ష్మయ్య వారిని పిలిపించి గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టాడు. ఈ క్రమంలో మాటా మాటా పెరిగి ఇరువర్గాల మధ్యన ఘర్షణ తలెత్తింది.
ఈ క్రమంలో లక్ష్మయ్య, అతని భార్యపై డబ్బులు ఇవ్వాల్సిన, వ్యక్తి అతని స్నేహితులు కలిసి దాడి చేసినట్టు బాధితుడు ఆరోపించాడు. దీంతో ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు లక్ష్మయ్య తన భార్యతో పాటు వెళ్తుండగా.. కొందరు దుండగులు కార్‌లో వాళ్లబైక్‌ను వెంబడించారు. అయితే లక్ష్మయ్య వారి నుంచి తప్పించుకోవడానికి సూర్యాపేట టౌన్ శివారు బీబీగూడెం పరిధిలోకి రాగానే రోడ్డు పక్కన ఉన్న ఒక వైన్స్ షాప్ వద్ద బైక్‌ను పడేసి.. లోపలికి పరుగులు తీశారు.
అంతలోనే అక్కడికి వచ్చిన దుండగులు కత్తులు, కర్రలతో లక్ష్మయ్యపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. కానీ వైన్ షాప్‌లో ఉన్న స్థానికులంతా ఒక్కసారిగా బయటకు రావడంతో దుండగులు అక్కడి నుంచి కారు తీసుకొని పారిపోయారు. దీంతో లక్ష్మయ్య అతని ఫ్యామిలీ ఊపిరిపీల్చుకున్నారు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి నిందితులపై ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




