AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఇంతేనా.. ఇంకో వెయ్యి ఇవ్వు.. రైతుల నుంచి లంచం డిమాండ్ చేసిన తహసీల్దార్.. చివరకు ఏమైందంటే..

Telangana: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో తన కార్యాలయమే కేంద్రంగా చేసుకొని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడు తహాసిల్దార్ రాజారావు. ప్రభుత్వ కార్యాలయాలలో ప్రజలకు అందాల్సిన సేవలకు లంచం డిమాండ్ చేస్తూ తమ అవినీతి దాహాన్ని తీర్చుకుంటున్నారు. కొందరు అధికారులు అందుకు..

Telangana: ఇంతేనా.. ఇంకో వెయ్యి ఇవ్వు.. రైతుల నుంచి లంచం డిమాండ్ చేసిన తహసీల్దార్.. చివరకు ఏమైందంటే..
N Narayana Rao
| Edited By: |

Updated on: Jun 24, 2025 | 12:39 PM

Share

రాష్ట్రంలో ఏసీబీ దాడులు జరుగుతూ అధికారులు పట్టుబడుతున్నా.. అవినీతి అధికారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ప్రతి పనికి ఓ రేటు కట్టి మరి లంచం మా హక్కు అన్నట్లు మితిమీరి వ్యవహరిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో తహసిల్దార్ అయితే వెయ్యి తక్కువ అయ్యాయని రైతును పీడించుకు తిన్నాడు. తహసీల్దార్ రాజారావు వసూళ్ల దందా, అంతా ఇంతా కాదు. తహాసిల్దార్ కార్యాలయం కేంద్రంగా లంచం డిమాండ్, తన ఛాంబర్ లో రైతు నుండి ఐదు వేలు లంచం తీసుకుంటున్న వీడియో వైరల్ అవుతోంది. పాస్ బక్ లో పేరు మార్పు కోసం లంచం డిమాండ్ చేసిన తహసీల్దార్ రాజారావు రైతు వద్దు ఐదు వేలు తీసుకుంటూ ఇంతేనా అంటు రైతుతో సంభాషణ, గుంటకు వెయ్యి చొప్పున ఇవ్వాల్సిందే అంటూ పట్టు బట్టాడు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో తన కార్యాలయమే కేంద్రంగా చేసుకొని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడు తహాసిల్దార్ రాజారావు. ప్రభుత్వ కార్యాలయాలలో ప్రజలకు అందాల్సిన సేవలకు లంచం డిమాండ్ చేస్తూ తమ అవినీతి దాహాన్ని తీర్చుకుంటున్నారు. కొందరు అధికారులు అందుకు ఈ దృశ్యాలే నిదర్శనం. అశ్వాపురం మండలంలోని మల్లెల మడుగు గ్రామానికి చెందిన రైతు పాస్ బుక్ లో పేరు మార్పు కోసం ఇటీవల దరఖాస్తు చేసుకున్నారు. అందుకుగాను గత కొన్ని రోజులుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఈ క్రమంలోనే పేరు మార్చాలంటే పైసలు ఇవ్వాల్సిందే అంటూ తాసిల్దార్ రాజారావు డిమాండ్ చేయడంతో రైతు 5000 రూపాయలు తాసిల్దార్ కు లంచం ఇచ్చాడు.

అయినా తృప్తి పడని తహసిల్దార్ రాజారావ్ ఇదేంటి ఐదు వేలేనా గుంటకు వెయ్యి చొప్పున ఇవ్వాల్సిందే ఇంకో వెయ్యి కూడా పంపించు అంటూ ఆదేశించారు. దీంతో చేసేదేమీ లేక రైతు సరే పంపిస్తా అంటూ రైతు కార్యాలయం నుండి వెళ్లిపోయాడు. ప్రజలకు ఉచితంగా అందించాల్సిన సేవలకు మండల స్థాయి అధికారే లంచం డిమాండ్ చేయడంతో ఆ రైతు తన సెల్ఫోన్లో ఈ దృశ్యాలను చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. లక్షలకు లక్షలు జీతాలు తీసుకుంటున్న ప్రభుత్వ అధికారులు బల్ల కింద చేతులు పెట్టడం మాత్రం మానడం లేదు అనేందుకు అశ్వాపురం తహసిల్దార్ రాజారావు ఘటనే ఓ ఉదాహరణ. తహసీల్దార్ వసూళ్లు దందా పై కలెక్టర్ సీరియస్ అయ్యారు. వెంటనే బదిలీ చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

దారిద్ర్యం తీరిపోయే సమయం వచ్చేసింది.. వీరికి మహాలక్ష్మి యోగం
దారిద్ర్యం తీరిపోయే సమయం వచ్చేసింది.. వీరికి మహాలక్ష్మి యోగం
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
15 ఏళ్లుగా వెండితెరకు దూరం.. కానీ దేశంలోనే అత్యంత ధనిక హీరోయిన్!
15 ఏళ్లుగా వెండితెరకు దూరం.. కానీ దేశంలోనే అత్యంత ధనిక హీరోయిన్!
దేశంలో అత్యధిక మైలేజీ ఇచ్చే బైక్స్‌ ఇవే..మార్కెట్లో ఫుల్‌ డిమాండ్
దేశంలో అత్యధిక మైలేజీ ఇచ్చే బైక్స్‌ ఇవే..మార్కెట్లో ఫుల్‌ డిమాండ్
ప్రేమించి పెళ్లాడి.. 9 నెలలకే భార్యను హతమార్చిన భర్త!
ప్రేమించి పెళ్లాడి.. 9 నెలలకే భార్యను హతమార్చిన భర్త!
మేకప్‌కి నో చెప్తున్నా భారీ ఆఫర్లు..! స్టార్ నటి సీక్రెట్ ఏంటి?
మేకప్‌కి నో చెప్తున్నా భారీ ఆఫర్లు..! స్టార్ నటి సీక్రెట్ ఏంటి?
అప్పటి కల్లా ఫైళ్లన్నీ ఆన్‌లైన్ కావాలి.. కలెక్టర్లకు చంద్రబాబు..
అప్పటి కల్లా ఫైళ్లన్నీ ఆన్‌లైన్ కావాలి.. కలెక్టర్లకు చంద్రబాబు..
ఒక దశాబ్దపు ప్రస్థానం! ఆ సూపర్‌‌హిట్ సినిమాకు పదేళ్లు
ఒక దశాబ్దపు ప్రస్థానం! ఆ సూపర్‌‌హిట్ సినిమాకు పదేళ్లు
మైక్రోవేవ్ ప్రాణాంతకమా? ఈ నిజాలు తెలిస్తే షాక్ అవుతారు!
మైక్రోవేవ్ ప్రాణాంతకమా? ఈ నిజాలు తెలిస్తే షాక్ అవుతారు!
చలితో బరువుతగ్గొచ్చట.. బ్రౌన్ ఫ్యాట్ సీక్రెట్ చెప్పిన సైంటిస్టులు
చలితో బరువుతగ్గొచ్చట.. బ్రౌన్ ఫ్యాట్ సీక్రెట్ చెప్పిన సైంటిస్టులు