ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇకపై బస్సుల్లో వైఫై
ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ సంక్షేమంలో ముందుకు వెళ్తున్న తెలంగాణ సర్కార్.. తాజాగా బస్సుల్లో సాంకేతికను పెంచే అంశంపై దృష్టి పెట్టింది. త్వరలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి వై-ఫై సౌకర్యం అందుబాటులోకి తెచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. బస్సుల్లో ఇంటర్నెట్ సేవలు అందించడంపై ఇటీవల ఢిల్లీకి చెందిన ఓ ప్రైవేటు సంస్థ ఆర్టీసీకి ప్రతిపాదనలు అందజేసింది.
ఈ ప్రతిపాదనలపై ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన రివ్యూ మీటింగ్‌లో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరాలను అందించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా బస్సులు, బస్టాండ్లు, రవాణాశాఖ కార్యాలయాల్లో వై-ఫై సదుపాయాలను అందించాలని ప్రైవేటు సంస్థ ప్రతిపాదించింది. ఇది సాధారణ ఇంటర్నెట్ యాక్సెస్ కాకుండా.. ముందుగా సెలక్ట్ చేసిన సినిమాలు, సాంగ్స్ వంటి కంటెంట్‌ను ప్యాసింజర్స్ తమ మొబైళ్లలో చూసేలా ఏర్పాటు చేస్తామని పేర్కొంది. వై-ఫై ద్వారా అందించే కంటెంట్ మధ్య అడ్వర్టైజ్‌మెంట్స్ కూడా వస్తాయి. ఈ ప్రకటనల ద్వారా ప్రైవేటు సంస్థకు ఆదాయం సమకూరుతుందని.. అందులో భాగస్వామ్యంతో ఆర్టీసీకి కూడా ఆర్థిక ప్రయోజనం ఉంటుందని ఆర్టీసీ వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రతిపాదనలపై మరింత స్పష్టత కోసం త్వరలో ఆ సంస్థ, ఆర్టీసీ మధ్య మరో మీటింగ్ జరగనుంది. ఆ సమావేశం అనంతరం ప్రాజెక్ట్ అమలుకు సంబంధించిన పూర్తి కార్యచరణ రూపొందిస్తారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం మరింత సౌకర్యవంతం అవుతుందని.. ప్రయాణికులు తక్కువ ధరలో వినోదాన్ని ఆస్వాదించగలరని భావిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘స్ట్రా’ అతిగా వాడితే.. ఈ రోగాలు మీకు ఎక్స్‌ట్రా బోనస్.. అవసరమా మనకి ఇవి..
మొదలైన వర్షాకాలం.. ఆరోగ్యం కోసం ఈ జాగ్రత్తలు తీసుకోలేదో.. ఈ రోగాలు రావడం పక్కా
కలిసి మందు కొట్టారు.. పిల్లలిద్దరికీ పెళ్లి చేద్దామనుకున్నారు.. కట్ చేస్తే..
ఫాస్టాగ్ యాన్యువల్ పాస్.. అదిరిపోయే ఆఫర్ గురూ
క్లాస్ రూమ్‌లో శ్రద్ధగా చదువుకుంటున్న విద్యార్థులు.. ఉన్నట్టుండి హాజరైన అనుకోని అతిధి.. కట్ చేస్తే
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

