Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్లాస్‌ రూమ్‌లో శ్రద్ధగా చదువుకుంటున్న విద్యార్థులు.. ఉన్నట్టుండి హాజరైన అనుకోని అతిధి.. కట్ చేస్తే

క్లాస్‌ రూమ్‌లో శ్రద్ధగా చదువుకుంటున్న విద్యార్థులు.. ఉన్నట్టుండి హాజరైన అనుకోని అతిధి.. కట్ చేస్తే

Phani CH
|

Updated on: Jun 23, 2025 | 8:13 PM

Share

రుతుపవనాల రాకతో వర్షాలు జోరందుకున్నాయి. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. అదే సమయంలో పుట్టలు, అటవీప్రాంతాల్లో ఉండాల్సిన పాములు జనావాసాల్లో సంచరిస్తున్నాయి. ఆహారం, ఆవాసం వెతుక్కుంటూ ఇళ్లు, పాఠశాలలు, కార్లు, బైకులు ఇలా ఎక్కడపడితే అక్కడ తిష్టవేస్తున్నాయి. ఈ క్రమంలో ఇంట్లో ఏమూలన ఏ పాముందో, బైకు సీటులోనే పాముందో.. డోమ్‌లోనే పాముందో అని భయపడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

అంతేకాదు, ఇటీవల పాములు తమ జంటలను వెతుక్కుంటూ వాటితో జతకడుతూ ప్రజలకు దర్శనమిస్తున్నాయి. తాజాగా ఓ పాఠశాలలో ప్రవేశించిన పాము విద్యార్థులను పరుగులు పెట్టించింది. ఈ ఘటన వరంగల్‌ జిల్లాలో జరిగింది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మాణిక్యపూర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో పాము హల్‌చల్‌ చేసింది. పాఠశాల ఆవరణలోనుంచి నేరుగా క్లాస్రూమ్‌లోకి ప్రవేశించింది. స్కూల్‌ ఆవరణలో పామును గమనించిన విద్యార్ధులు భయంతో పరుగులు తీశారు. విషయం ఉపాధ్యాయులకు చెప్పడంతో వారు మిగతా సిబ్బందిని అలర్ట్‌ చేశారు. క్లాస్‌ రూమ్‌లో విద్యార్ధులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం పాము ఎటో వెళ్లిపోవడంతో ఆ పాము ఎక్కడ నక్కిందో.. ఎవరికి ఎలాంటి ప్రమాదం తలపెడుతుందోనని ఆందోళన చెందుతున్నారు. పాఠశాల పక్కనే నర్సరీ ఏర్పాటు చేయడం, పాఠశాల ఆవరణ చుట్టూ మొక్కలు పెరిగిపోవడంతో పాములు, తేళ్లు తరచూ పాఠశాలలోకి వస్తున్నాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు. తమ పిల్లలు ఏ క్షణంలో ఏ పాము బారిన పడతారోనని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మరోసారి జంటగా కనిపించిన విజయ్‌దేవరకొండ-రష్మిక.. ఈసారి

ఘోరమైన యాక్సిడెంట్!! చావు నుంచి బయటపడ్డ గీతూ రాయల్

ఇక్కడ వాడుకునే వాళ్లు ఎక్కువయ్యారు

భర్త టార్చర్ పెడుతూ చావ కొడుతున్నాడు.. PMOతో మొరపెట్టుకున్న నటి

Published on: Jun 23, 2025 08:11 PM