Viral Video: పిల్లలకు పాఠాలు చెప్పమంటే.. క్లాస్ రూమ్ లో గురకపెట్టి నిద్రపోయిన మాస్టారు..!
విద్యా శాఖలో అలసత్వం.. విద్యార్థులు చదువుతుండగా టీచర్ నిద్రపోయాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని గడేగావ్ లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వైరల్ న్యూస్ కి సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ వీడియోలో ఓ టీచర్ కుర్చీలో కూర్చుని, కాళ్లు మరో కుర్చీపై పెట్టుకుని నిద్రపోతూ కనిపిస్తున్నాడు కదూ.. విద్యార్థులు మాత్రం చదువులో లీనమై ఉన్నారు. వీడియో తీస్తున్న వ్యక్తి ఒక విద్యార్థిని ఎప్పటి నుండి మీ టీచర్ నిద్రపోతున్నాడు..? అని అడిగాడు. ఆ విద్యార్థి కొంతసేపు ఆలోచించి అరగంట నుంచి నిద్రపోతున్నారని బదులిచ్చింది.
నిద్రలేచిన టీచర్ కెమెరా ఉన్నా కూడా ఏమాత్రం పట్టించుకోకుండా మామూలుగానే ఉన్నాడు. ఈ వీడియో చూస్తున్న నెటిజన్లు టీచర్ ప్రవర్తనపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ ఘటనపై విద్యా శాఖ అధికారులకు ఫిర్యాదు అందింది. దీంతో జోనల్ ఎడ్యుకేషన్ అధికారి సతీష్ షిండే స్పందిస్తూ.. పూర్తి విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
గతంలో ఉత్తరప్రదేశ్ లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. గత సంవత్సరం అలీఘర్ జిల్లాలోని ఓ ప్రాథమిక పాఠశాలలో టీచర్ క్లాసులో నేలపై పడుకుని ఉండగా.. విద్యార్థులు ఆమెకు చేతితో గాలి విసురుతూ కనిపించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే ఈ వీడియోపై అధికారులు వివరణ ఇచ్చారు. జిల్లా ప్రాథమిక విద్యాధికారి రాకేష్ సింగ్ చెప్పినదాని ప్రకారం.. ఆ టీచర్ కుర్చీ నుండి జారిపడిపోయారు. వెంటనే విద్యార్థులు ఆమెకు సాయం చేసే ఉద్దేశంతో గాలి విసిరారు. దర్యాప్తు తర్వాత వీడియోలోని దృశ్యాలను తప్పుగా అర్థం చేసుకున్నారని అధికారులు స్పష్టం చేశారు.
टेबलवर पाय ठेवून शिक्षक भर वर्गात विद्यार्थ्यांसमोरच झोपले; जालन्याच्या जाफराबाद तालुक्यातील गाडेगव्हाण येथील जिल्हा परिषद शाळेतील प्रकार ! . . .#jalna #jalnanews #zpschool #zpschoolteacher #eduvarta #educationalnews #viralvideo pic.twitter.com/TWzaPNupeo
— Edu Varta (@EduvartaNews) June 20, 2025
