ఇక్కడ వాడుకునే వాళ్లు ఎక్కువయ్యారు
ఎస్తేర్..! టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ... ఉన్నట్టుండి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఏ సందర్భం లేకపోయినా.. ఆమె వేశ్యల గురించి ఓపెన్‌గా మాట్లాడటంతో..ఆమె బోల్డ్ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఎస్తేర్ నోరోన్హా.. 2013లో 1000 అబద్ధాలు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.
మరుసటి ఏడాది సునీల్ నటించిన భీమవరం బుల్లోడు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. చేసింది తక్కువ సినిమాలే అయినా.. తన ఆకట్టుకునే అందం, అదిరిపోయే అభినయంతో ఈ బబ్లీ భామ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కాకపోతే ఆమె నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవటంతో క్రమంలో ఈ అమ్మడికి అవకాశాలు తగ్గుతూ.. వచ్చాయి. ఇంతలోనే, ఎవరూ ఊహించని విధంగా సింగర్ నోయల్ ను పెళ్లి చేసుకొని తన అభిమానులకు షాక్ ఇచ్చింది. కానీ, ఆ తర్వాత కొన్ని రోజులకే నోయల్ తో విడిపోయింది. ఇక ప్రస్తుతం ఎస్తేర్ సింగిల్ గా ఉంటోంది. నోయెల్‌తో విడిపోయిన తర్వాత ఈ బ్యూటీ చిన్న చిన్న సినిమాలు చేస్తూ అలరిస్తోంది. అలాగే అందాల ఆరబోతకు హద్దులు చెరిపేస్తూ రొమాంటిక్స్ సీన్స్ లోనూ నటించేందుకు సై అంటోంది. తాజాగా ది వేకెంట్ హౌస్ అనే సినిమాకు దర్శకత్వంతో పాటు నిర్మాతగానూ వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఎస్తేర్ వేశ్యల గురించి మాట్లాడింది. సమాజంలో వేశ్యలను చాలామంది చులకనగా చూస్తారని చెప్పుకొచ్చింది. నిజానికి ఎవరూ కావాలనివేశ్యా వృత్తిలోకి రారని, ఆర్ధిక పరిస్థితులే అందుకు కారణమని అభిప్రాయపడింది. ‘నిజంగా మగాళ్లకు వేశ్యల పట్ల సానుభూతి ఉంటే.. వారి దగ్గర వెళ్లి.. కోరిక తీర్చుకోకుండా డబ్బులు ఇచ్చి రావాలి. కానీ, ఎవరూ అలా చేయరు. సమాజంలో వేశ్యలున్నారంటే.. వారిని వాడుకునే వారూ ఉన్నారనే అర్థం. నిజంగా మగాళ్లంతా పవిత్రంగా ఉంటే.. ఈ లోకంలో వేశ్యలు ఉండేవారు కాదేమో’ అని మాట్లాడింది. ఉన్నట్లుండి.. ఎస్తేర్ ఈ టాపిక్ మీద ఎందుకు మాట్లాడిందో మాత్రం ఎవరికీ అర్థం కాకపోయినా.. ఈమె కామెంట్స్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భర్త టార్చర్ పెడుతూ చావ కొడుతున్నాడు.. PMOతో మొరపెట్టుకున్న నటి

రైలులో యువతి రీల్.. కానీ ఊహించని గెస్ట్ ఎంట్రీతో సీన్ రివర్స్

చేపకు గాలం వేస్తే.. జాలరే గల్లంతయ్యాడు వీడియో

సజీవ పురుగుల్ని వాంతి చేసుకుంటున్న చైనా బాలిక వీడియో

సునామీ మేఘాన్ని చూసారా వీడియో

గాజు సీసాల్లో మైక్రోప్లాస్టిక్స్.. ? వీడియో

రెస్టారెంట్లోకి దూసుకెళ్లిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే? వీడియో

ఆమెకు నొప్పి పుట్టదు.. బాధ అనిపించదు.. శాస్త్రవేత్తలకే సవాలుగా..

రైల్లో పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు బాబోయ్.. మరీ ఇలానా?

నమీబియా పార్లమెంట్లో ప్రధాని మోదీ కీలక ప్రసంగం..

రెస్టారెంట్లోకి దూసుకెళ్లిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే? వీడియో

ఆమెకు నొప్పి పుట్టదు.. బాధ అనిపించదు.. శాస్త్రవేత్తలకే సవాలుగా..

రైల్లో పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు బాబోయ్.. మరీ ఇలానా?
