ఫాస్టాగ్ యాన్యువల్ పాస్.. అదిరిపోయే ఆఫర్ గురూ
వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. తరచూ సొంత వాహనాల్లో ప్రయాణించే వారితో బాటు ట్రాన్స్ పోర్ట్ వాహనాల యజమానులకు కేంద్ర రవాణా శాఖ అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది. ఇకపై,ఏడాదికి ఒకసారి రూ. 3 వేలతో ఫాస్టాగ్ రీఛార్జ్ చేసుకుంటే.. సంవత్సరంలో దేశంలో ఎక్కడైనా 200 ట్రిప్పులు వేయొచ్చు.
ఒకవేళ.. వాహనదారులు సంవత్సరంలో 200 ట్రిప్పులు పూర్తి చేసుకుంటే.. వెంటనే వారు ఫాస్టాగ్ పాస్‌ను మళ్లీ రెన్యువల్ చేయించుకోవాలి. అలాగే.. ఏడాదిలో వారు 200 ట్రిప్పులు పూర్తి చేయకపోయినా, ఏడాది పూర్తయితే మాత్రం మళ్లీ పాస్ ను రెన్యువల్ చేయించుకోవాలి.ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి ఎక్స్ ద్వారా దీని వివరాలను వెల్లడించారు. ఈ ఏడాది ఆగష్టు 15 నుంచి ఈ విధానం అమలులోకి రానుంది. దేశంలోని నేషనల్ హైవేల మీద ఎలాంటి ఆంక్షలు లేని ప్రయాణాన్ని వాహనదారులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకే ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్‌ను తీసుకొస్తున్నట్లు గడ్కరీ తెలిపారు. ఈ పాస్ రాకతో.. టోల్ గేట్ల వద్ద క్యూలు తగ్గుతాయని, దానివల్ల కార్లు, జీపులు, వ్యాన్ల యజమానులు మరింత త్వరగా గమ్యస్థానాలకు చేరుకోగలుగుతారని గడ్కరీ చెప్పుకొచ్చారు. అంతేగాక.. భారత టోల్ గేట్ వ్యవస్థ మొత్తం డిజిటలైజ్ అవుతుందని, దీనివల్ల అవినీతి తగ్గుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
క్లాస్ రూమ్‌లో శ్రద్ధగా చదువుకుంటున్న విద్యార్థులు.. ఉన్నట్టుండి హాజరైన అనుకోని అతిధి.. కట్ చేస్తే
మరోసారి జంటగా కనిపించిన విజయ్‌దేవరకొండ-రష్మిక.. ఈసారి
ఘోరమైన యాక్సిడెంట్!! చావు నుంచి బయటపడ్డ గీతూ రాయల్
ఇక్కడ వాడుకునే వాళ్లు ఎక్కువయ్యారు
భర్త టార్చర్ పెడుతూ చావ కొడుతున్నాడు.. PMOతో మొరపెట్టుకున్న నటి

ఇదేం వింత సంప్రదాయం.. అక్కడ ప్రతీ పురుషుడికీ ఇద్దరు భార్యలు!

వందేళ్ల ప్రయాణం ముగిసింది.. వైరల్ వీడియో

ప్లాస్టిక్‌ను తినేస్తున్న పురుగులు..వైరల్ వీడియో

ఇది పొగ లేని సిగరెట్ కానీ దీనిని పీల్చరు.. తాగుతారు వీడియో

కుక్కను పెంచుకోవడానికి .. మీ ఇరుగు పొరుగు పర్మిషన్ తప్పనిసరి!

గూగుల్ మ్యాప్స్ ను గుడ్డిగా నమ్మి వెళ్తుండగా.. గుంతలో పడ్డ కారు

బద్ధలవుతున్న అగ్నిపర్వతం సాక్షిగా.. జంట నిశ్చితార్థం
